Go First crisis: ప్రయాణికుల రుసుమును తిరిగి చెల్లించండి : DGCA ఆదేశం

నగదు కొరతతో 'గో ఫస్ట్' విమాన సంస్థ విమాన సర్వీసులను నడపలేకపోతోంది. అందుకుగాను రెండు రోజులనుంచి విమాన సర్వీసులను నడపడం ఆపేసింది. రద్దు చేసిన సర్వీసుల విమాన టికెట్లను బుక్ చేసుకున్న వారికి నగదును తిరిగి చెల్లించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) గురువారం ఎయిర్‌లైన్ గోఫస్ట్‌ను కోరింది. తీవ్రమైన నగదు కొరతను పేర్కొంటూ వాడియా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్‌లైన్ స్వచ్ఛంద దివాలా పిటిషన్‌ను దాఖలు చేసిన తర్వాత DGCA ప్రకటన వచ్చింది.
"DGCA గో ఫస్ట్ యొక్క ప్రతిపానను పరిశీలించడం జరిగింది. సంబంధిత నియంత్రణలో ప్రత్యేకంగా నిర్దేశించిన సమయపాలన ప్రకారం ప్రయాణీకులకు వారి నగదును తిరిగి చెల్లించే ప్రాసెస్ ను మొదలు పెట్టమని నిర్దేశిస్తూ ఉత్తర్వును జారీ చేసింది" అని అధికారులు తెలిపారు. దివాలా కోసం దాఖలు చేసినట్లు ప్రకటించినప్పుడు, గో ఫస్ట్ NCLT విచారణ ఆధారంగా దాని తదుపరి చర్యను గుర్తించడానికి మే 5, 2023 వరకు విమానాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపింది.
గో ఫస్ట్ కూడా మే 15 వరకు విమాన టిక్కెట్ల విక్రయాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలియజేసింది. ఎయిర్‌లైన్ భవిష్యత్తు అనిశ్చితంగా ఉన్నందున, భవిష్యత్ తేదీలో ప్రయాణించడానికి టిక్కెట్‌లను బుక్ చేసుకున్న ప్రయాణీకులకు రీఫండ్‌లను ప్రాసెస్ చేయాలని DGCA ఎయిర్‌లైన్‌ను ఆదేశించింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే తమ షెడ్యూల్డ్ కార్యకలాపాలను నిలిపివేయాలని గో ఫస్ట్ తీసుకున్న ఆకస్మిక నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికుల అసౌకర్యాన్ని తగ్గించేందుకు కట్టుబడి ఉన్నామని DGCA తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com