అనూహ్యం.. 16 ఓట్లతో బీజేపీ అభ్యర్ధి విజయం

అనూహ్యం.. 16 ఓట్లతో బీజేపీ అభ్యర్ధి విజయం
X

బెంగళూరు జయనగర నియోజకవర్గంలో అనూహ్యంగా... బీజేపీ అభ్యర్ధి సీకే రామ్మూర్తి కేవలం 16 ఓట్లతో విజయం సాధించారు. నిన్న ఉదయం నుంచి... బీజేపీ, కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్లు కౌంటింగ్ సాగింది. చివరికి సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్ధి సౌమ్యా రెడ్డి విజయం సాధించినట్లు ప్రకటించారు. కేవలం 160 ఓట్ల తేడాతో సౌమ్యారెడ్డి విజయం సాధించడంతో .. బీజేపీ అభ్యర్థి సీకే. రామమూర్తి రీకౌంటింగ్ కు పట్టుబట్టారు. దీంతో ఉద్రిక్తత ఏర్పడింది. సౌమ్యా రెడ్డి, సీకే రామమూర్తిల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది. మూడు సార్లు రీకౌంటింగ్ నిర్వహించారు ఎన్నికల అధికారులు. అర్థరాత్రి వరకు టెన్షన్ వాతావరణం ఏర్పడింది. దీంతో అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దింపారు. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, డీకే సురేష్. మాజీ సీఎం సిద్దరామయ్య, బీజేపీ ఎమ్మెల్సీలు, బీజేపీ నాయకులు జయనగర్ చేరుకుని ఎన్నికల అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మొత్తం మీద రీకౌంటింగ్ లో.. రామమూర్తి 16 ఓట్లతో గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

Tags

Next Story