కర్ణాటక ఎన్నికలకు కౌంట్‌డౌన్..224 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్

కర్ణాటక ఎన్నికలకు కౌంట్‌డౌన్..224 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్
X
కర్ణాటక ఎన్నికల పోలింగ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. రేపు 224 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. 13న ఫలితాలు వెల్లడికానున్నాయి

కర్ణాటక ఎన్నికల పోలింగ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. రేపు 224 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. 13న ఫలితాలు వెల్లడికానున్నాయి. మేజిక్ ఫిగర్ 113 వచ్చిన పార్టీ అధికారాన్ని చేపట్టనుంది. బీజేపీ 224 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టగా.. కాంగ్రెస్ 223, జేడీఎస్ 207, ఆమ్ ఆద్మీ 209 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాయి. 918 మంది స్వతంత్రులతో కలిపి 2 వేల 613 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇవాళ ఒక్క రోజే పోలింగ్కు గడువు ఉండడంతో రాజకీయ పార్టీలన్నీ ప్రలోభాలకు తెరలేపుతున్నాయి.

పోలింగ్‌ ప్రశాంతంగా జరిగేలా ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే భారీగా మోహరించిన పోలీసు బలగాలు.. ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈసీ ఆదేశాలతో సరిహద్దులో నగదు, మద్యం రవాణాపైనే దృష్టి పెట్టారు. ఇందుకోసం 43 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. మొత్తం 44 మండలాల పరిధిలోని 47 పోలీసు స్టేషన్లు, 19 ఎస్‌ఇబి స్టేషన్లు, అంతరాష్ట్ర సరిహద్దుల్లో 57 సమీకృత చెక్‌ పోస్టుల ద్వారా నిరంతరం నిఘా కొనసాగుతోంది. కర్ణాటకలోని చిత్రదుర్గ, బళ్లారి, రాయచూరు, చుండూరు, కోలార్‌, చిక్‌ బళ్లాపుర తదితర సరిహద్దు ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. 24 గంటల పాటు తనిఖీలు, చెక్‌పోస్టుల ఏర్పాటుకు ఆస్కారం లేని చోట్ల నిరంతరం పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు కోట్లలో నగదుతో పాటు 12 కోట్ల 66 లక్షల 55 వేల 614 కోట్ల విలువైన మద్యం, సారా, ఇతర ప్రలోభాలను సీజ్‌ చేశారు.

కర్ణాటక ఓటర్లు వరుసగా ఏ పార్టీకి అధికారం కట్టబెట్టరనే సంప్రదాయం ఉంది. దీంతో మరోసారి అధికారం నిలబెట్టుకునేందుకు బీజేపీ ప్రచారాన్ని హోరెత్తించింది. బీజేపీకి ధీటుగా కాంగ్రెస్ ప్రచారం నిర్వహించింది. సర్వేలన్నీ తమకు అనుకూలంగా ఉన్నాయంటూ రెట్టించిన ఉత్సాహంతో కాంగ్రెస్‌ ముమ్మరంగా ప్రచారం చేసింది. అదృష్టం కలిసొస్తే మరోసారి కింగ్ మేకర్ కావాలని జేడీఎస్‌ చూస్తోంది. అధికారమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహించి వేళ.. మరి కన్నడ ఓటర్లు ఎవరికి పట్టం కడతారో చూడాలి.

Tags

Next Story