గ్యాంగ్ స్టర్ అతిక్ హత్యపై సుప్రీంకోర్టులో విచారణ

గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ హత్యలపై దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్ ను విచారించేందుకు సుప్రీం కోర్లు అంగీకరించింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలోని ఈ పిటీషన్ ను ఈనెల 24న విచారణకు రానుంది. ఉత్తరప్రదేశ్‌లో జ్యుడీషియల్‌కు వెలుపల జరిగిన హత్యలపై విచారణ జరిపించాలని పిటిషన్‌లో కోరారు. శనివారం ప్రయాగ్‌రాజ్‌లో మెడికల్ చెకప్ కోసం అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ లను పోలీసులు ఆసుపత్రికి తీసుకువెళుతుండగా... జర్నలిస్ట్ ముసుగులో వచ్చిన దుండగులు వారిని కాల్చి చంపారు. ఈ హత్యలపై విచారణ జరిపేందుకు స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
"ఉత్తరప్రదేశ్ స్పెషల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) ప్రకారం 2017 నుంచి 183 ఎన్ కౌంటర్ లు జరిగినట్లు పోలీసులు తెలిపారు. సుప్రీంకోర్డు మాజీ న్యాయమూర్తి అధ్యక్షతన స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని, అతిక్, అష్రఫ్ ల పోలీసు కస్టడీ హత్యపై కూడా విచారించాలని పిటీషన్ లో పేర్కొన్నారు. పోలీసులు ఇష్టారీతిన ప్రవర్తించడం వలన పోలీస్ రాజ్యానికి దారితీసే అవకాశాలు ఉన్నట్లు పిటీషన్ లో పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com