రానున్న 3 రోజులు వడగళ్లతో కూడిన భారీ వర్షాలు

రానున్న 3 రోజులు వడగళ్లతో కూడిన భారీ వర్షాలు
X
తెలుగు రాష్ట్రాల్లో రానున్న 3 రోజులు వడగళ్లతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 3 రోజులు వడగళ్లతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. పశ్చిమ విదర్భ నుంచి మరఠ్వాడా, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు సగటు సముద్రమట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తున ద్రోణి అనిశ్చితి కొనసాగుతోందని ఐఎండీ వివరించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటక రాష్ట్రాల్లో ఉరుములు, వడగళ్లతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఢిల్లీ, పంజాబ్‌, రాజస్థాన్, హరియాణా, మధ్యప్రదేశ్‌లోనూ భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది.

Tags

Next Story