"ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకున్నాం... ముస్లింలను కాదు"

ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకున్నాం... ముస్లింలను కాదు

నటి అదా శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా "ధ కేరళ స్టోరి". 30వేల మంది కేరళ యువతులు తప్పిపోయి ఉగ్రవాదులకు బలయ్యారన్న అంశంతో తెరకెక్కింది. ఈ చిత్రాన్ని నిలిపివేయాలంటూ కేరళ రాజకీయనాయకులు పిలుపునిచ్చారు. మే 5న రిలీజ్ కానున్న ఈ చిత్రంపై కేరళ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంపై చిత్ర యునిట్ స్పంధించింది. ఈ సినిమా ముస్లింలకు, కేరళ రాష్ట్రానికి వ్యతిరేకంగా లేదని ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని తీసిన సినిమా అని వివరణ ఇచ్చారు. దర్శకుడు సుదీప్తో సేన్ మాట్లాడుతూ, "నెలల పాటు పరిశోధన చేసి ఈ చిత్రాన్ని నిర్మించాను. బాధితులతో మాట్లాడిన తర్వాత నేను చాలా చలించిపోయాను."అని అన్నారు.

చిత్ర నిర్మాత విపుల్ షా మాట్లాడుతూ.. "కేరళ రాష్ట్రానికి వ్యతిరేకంగా ఏమీ లేదు. సినిమాలో కించపరిచే విధంగా ఏమీ చెప్పలేదు. ఈ చిత్రం ఉగ్రవాదులను టార్గెట్ చేసింది, ముస్లింలను కాదు. కేరళ సీఎం సినిమాను చూడాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాట్లాడుతూ, లవ్ జిహాద్ అంశాన్ని లేవనెత్తడం ద్వారా రాష్ట్రాన్ని మత తీవ్రవాద కేంద్రంగా చిత్రీకరిస్తున్న సంఘ్ పరివార్ ప్రచారాన్ని ఈ చిత్రం ప్రచారం చేస్తుందని అన్నారు.

సుదీప్తో సేన్ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రం, దక్షిణాది రాష్ట్రంలో తప్పిపోయినట్లు ఆరోపించబడిన "సుమారు 32,000 మంది మహిళలు" వెనుక ఉన్న సంఘటనలను "తెలుసుకోవడం"గా చిత్రీకరించబడింది. వారు మతం మారారని, తీవ్రవాదులుగా మారారని, భారతదేశంలో, ప్రపంచంలోని తీవ్రవాద కార్యకలాపాలలో మోహరించినట్లు చిత్రం పేర్కొంది.

సీఎం విజయన్‌ సొంతగడ్డ అయిన కన్నూర్‌లో షూటింగ్‌ చేస్తున్న సమయంలో చిత్ర బృందంపై దాడి జరిగిందని, సినిమాలో నటించినందుకు అదా శర్మకు చాలా బెదిరింపు సందేశాలు వచ్చాయని దర్శకుడు పేర్కొన్నాడు. రెండు రోజుల క్రితం, కేరళలోని అధికార సిపిఎం, ప్రతిపక్ష కాంగ్రెస్ .. రాబోయే సినిమాపై విరుచుకుపడ్డాయి, భావప్రకటనా స్వేచ్ఛ సమాజంలో విషాన్ని చిమ్మడానికి లైసెన్స్ కాదని, ఈ చిత్రం మతాన్ని నాశనం చేసే ప్రయత్నం అని అన్నారు. సమాదానంగా దర్శకుడు సేన్ మాట్లాడుతూ, " సినిమాపై నిర్ణయానికి వచ్చే ముందు సినిమాను చూడాలని నేను ప్రజలను, సీఎంను కోరుతున్నాను." అని అన్నారు.


Tags

Next Story