Karnataka Polling : కర్నాటకలో ఊపందుకున్న ఎన్నికల పోలింగ్

కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఊపందుకుంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు మందకోడిగా సాగిన పోలింగ్.. ఆ తరువాత ఒక్కసారిగా పెరిగింది. ఓటర్లంతా పోలింగ్ స్టేషన్లకు క్యూ కట్టారు. జనం ఒక్కసారిగా తరలి రావడంతో పోలింగ్ స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. ఓటు వేసేందుకు జనం పోలింగ్ స్టేషన్ల వద్ద క్యూ కట్టారు. మధ్యాహ్నం మూడు గంటల వరకు 52.12శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
మైసూరులో మధ్నాహ్నం 3గంటల వరకు 52.4 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. ఇక బెంగళూరు సిటీ 41.3శాతం, బెంగళూరు గ్రామీణం 60.1శాతం రాయచూర్ 52.7 శాతం, రామనగర్ 63.3శాతం, శివమొగ్గ 56.1శాతం, ఉడిపి 60.2శాతం, విజయనగర 56.2శాతం, బల్లారి 53.3శాతం, బీదర్ 50.6 శాతం, విజయపురలో 49శాతం పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. సాయంత్రానికి పోలింగ్ శాతం భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు.
మరోవైపు పలు ప్రాంతాల్లో చిన్న చిన్న ఘర్షణలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగుతుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. భారీ బందోబస్తు నడుమ పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇక సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఆరు గంటల తరువాత కూడా క్యూలైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు అధికారులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com