చీకోటి ప్రవీణ్ సహా 84 మంది తెలుగు వారికి బెయిల్

క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ సహా థాయ్‌లాండ్ పోలీసులు అరెస్టు చేసిన 84 మంది తెలుగు వారికి బెయిల్ లభించింది. థాయ్‌లాండ్‌లోని పట్టాయా నగరంలో.. ఆసియా పట్టాయా స్టార్ హోటల్‌లో నిబంధనలకు విరుద్ధంగా క్యాసినో, జూదం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో థాయ్ పోలీసులు దాడి చేసి, 120 మందిని అరెస్టు చేశారు. వీరిలో చీకోటి ప్రవీణ్ సహా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 84 మంది ఉన్నారు. థాయ్ పోలీసులు వీరిని విచారించారు. వీరందరినీ మంగళవారం పట్టాయాలోని ప్రావిన్షియల్ కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఒక్కొక్కరికీ 4,500 బాత్‌లు మేర పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేశారు. భారత కరెన్సీలో దీని విలువ రూ. 10,790. విచారణ సందర్భంగా న్యాయమూర్తి పోలీసులు, ఇమిగ్రేషన్ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. 84 మంది తెలుగువారంతా ఇవాళ హైదరాబాద్‌కు రానున్నట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com