పొంచి ఉన్న మోచా తుపాను ముప్పు

పొంచి ఉన్న మోచా తుపాను ముప్పు
అకాల వర్షాలతో అల్లాడిపోతున్న రైతన్నలకు మరో పిడుగులాంటి వార్త. వచ్చే వారంలో తూర్పు తీర రాష్ట్రాలకు తుపాను ముప్పు పొంచి ఉంది

అకాల వర్షాలతో అల్లాడిపోతున్న రైతన్నలకు మరో పిడుగులాంటి వార్త. వచ్చే వారంలో తూర్పు తీర రాష్ట్రాలకు తుపాను ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతం లో తుపాను బలపడే అవకాశాలున్నట్లు భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. మత్య్సకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించింది. మే 6 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశముంది. ఆ మరుసటి రోజు అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఆ తర్వాత ఇది తీవ్ర అల్పపీడనంగా కేంద్రీకృతమై మే 9వ తేదీ నాటికి తుపానుగా బలపడే అవకాశముంది. ఈ తుపాను ఉత్తర దిశగా కదులుతూ మరింత తీవ్రమయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తొంది.

ఈ తుపాను ఏర్పడితే దానికి "మోచా "అని పేరు పెట్టనున్నారు. యెమెన్‌లోని పోర్టు నగరం మోచా పేరుమీదుగా పేరు పెట్టినట్టు పేర్కొంది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత తుపాను దిశ గురించి మరింత కచ్చితమైన సమాచారం తెలుస్తుందని ఐఎండీ వెల్లడించింది. వచ్చేవారంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని పేర్కొంది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించింది. మేలో వీటి ముప్పు మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక దేశంలో అక్టోబరు-డిసెంబరు మధ్య తిరోగమన రుతుపవనాల ప్రభావంతో మరో తుపాను సీజన్‌ ఉంటుంది. వీటికి తోడు పశ్చిమతీరంలోని అరేబియాసముద్రంలో కూడా తుపానులు ఏర్పడుతుంటాయని వాతావరణ శాఖ తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story