మణిపూర్‌లో పరిస్థితులు సర్దుకుంటున్నాయి : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

మణిపూర్‌లో పరిస్థితులు సర్దుకుంటున్నాయి : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

మణిపూర్‌లో ఇప్పుడిప్పుడే పరిస్థితులు సర్దుకుంటున్నాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మణిపూర్‌ అల్లర్పపై స్పందించిన కిషన్‌ రెడ్డి.. రాష్ట్రంలో శాంతి నెలకొల్పేందుకు అన్ని వర్గాలతో చర్చలకు సిద్ధమని ప్రకటించారు. హింసతో ఏమీ సాధించలేమని.. ప్రభుత్వ ఆస్తులు.. ప్రజల ఆస్తులు ధ్వంసమవుతాయన్నారు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. వ్యతిరేకత రావడంతో రైతు బిల్లును ప్రజాస్వామిక పద్ధతిలో వెనక్కి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం తమదన్నారు కిషన్ రెడ్డి. మణిపూర్‌ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 5 వేల 500 కోట్లను ఖర్చు చేసిందని… యువత హింసకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.

Tags

Next Story