కర్ణాటక గెలుపుతో కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం

కర్ణాటక గెలుపుతో కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం

కర్ణాటకలో గెలుపుతో కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. వరుస పరాజయాలతో ఢీలాపడ్డ ఆ పార్టీ.....ఈ విజయంతో... ఊపీరి పీల్చుకున్నట్లైంది. ఈ ఎన్నికల్లో భారత్ జోడో యాత్ర ప్రభావం స్పష్టంగా కనిపించింది. కర్ణాటకలో రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర సాగిన ప్రాంతాల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ‘భారత్‌ జోడో యాత్ర 20 నియోజకవర్గాల్లో సాగితే.. అందులో 15 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. మూడు చోట్ల జేడీఎస్‌, రెండు చోట్ల బీజేపీ గెలిచాయి. 2018లో ఈ 20 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఐదు చోట్ల మాత్రమే గెలిచింది. అప్పట్లో బీజేపీ 9చోట్ల, జేడీఎస్‌ 6చోట్ల గెలిచాయి. కానీ.. ఇప్పుడు ఏకంగా.. పది స్థానాలు అదనంగా కాంగ్రెస్ కు వచ్చాయి. ఇదంతా యాత్ర ప్రభావమేనంటున్నారు కాంగ్రెస్ నేతలు. కర్ణాటకలో రాహుల్‌ గాంధీ 22 రోజులపాటు 500 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఆ సమయంలో ఆయనకు భారీ మద్దతు లభించింది. ఇక 2018 ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత ఎన్నిక కాంగ్రెస్ ల్లో 5 శాతం అధిక ఓట్లు సాధించింది. గత ఎన్నికల్లో ఓట్లు ఎక్కువ సాధించినా.. సీట్లు మాత్రం తగ్గాయి. కానీ, ఈ సారి ఆ పార్టీ 56 స్థానాలు అధికంగా సాధించింది. అదే విధంగా జేడీఎస్‌ 5 శాతం ఓట్లు కోల్పోయింది. మధ్య కర్ణాటక, హైదరాబాద్‌ కర్ణాటక, పాత మైసూరు, ముంబయి కర్ణాటక ప్రాంతాల్లో కాంగ్రెస్‌ పార్టీ సత్తా చాటింది.

మరోవైపు... ఈ ఎన్నికల్లోలో 50 వేలకు పైగా మెజారీటీతో 12 స్థానాలను కాంగ్రెస్ అభ్యర్ధులు సొంతం చేసుకున్నారు. భారీ విజయం సాధించి నవారిలో కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షులు డీకే శివకుమార్ ఉన్నారు. కనపురం స్థానం నుంచి పోటీ పడిన ఆయన .. తన సమీప ప్రత్యర్ధి జేడీఎస్ కు చెందిన నాగరాజుపై లక్షా 22 వేల ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఇదే అత్యధిక మెజారీటీ కావడం విశేషం. ఇక... కాంగ్రెస్ విజయం గురించి ముందే చెప్పారు డీకే శివకుమార్. అంతే కాదు సాధించిన సీట్ల సంఖ్యను సైతం దాదాపు కచ్చితంగా చెప్పడం విశేషం. జనవరిలోనే... ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన ఆయన.. 136 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని స్పష్టంగా చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story