కర్నాటకలో బీజేపీని చావు దెబ్బ కొట్టిన వ్యూహాలు ఇవేనా..!

దక్షిణాదిలో బీజేపీకి ఉన్న ఒకే ఒక రాష్ట్రంలో అధికారాన్ని దూరం చేసింది హస్తం పార్టీ. అసలు కాంగ్రెస్ విజయ రహస్యం ఏంటి.? బలంగా ఉన్న బీజేపీని చావు దెబ్బ కొట్టిన వ్యూహాలు ఏంటి..? వాటి వెనుక ఎవరు ఉన్నారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికలనగానే రాజకీయ పార్టీలు ఓ రేంజ్‌లో మ్యానిఫెస్టోలను ముద్రించడం చూశాం. సాధ్యం కానీ హామీలను ప్రకటిస్తూ.. అరచేతిలో వైకుంఠం చూడమే మ్యానిఫెస్టోకు అర్థంగా మారిపోయింది. అయితే.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ రూటు మార్చింది. పంచ సూత్రాల పేరుతో ఐదంటే ఐదు హామీలనే ప్రకటించింది. అవి ఓటర్లను విశేషంగా ఆకట్టుకున్నాయి. తమ సమస్యలను తీర్చే హామీలుగా వారు గుర్తించేలా చేశాయి.
అయితే ఈ హామీల వెనక మాజీ ఐఏఎస్ అధికారి శశికాంత్ సెంథిల్ ఉన్నారన్న సంగతి అతికొద్ది మందికే తెలుసు.కాంగ్రెస్ వార్‌రూం ఇన్‌చార్జి సెంథిల్.. గ్రౌండ్ లెవల్‌లోలక్షల మంది నుంచి తీసుకున్న ఫీడ్‌బ్యాక్ తో ఈ ఐదు ప్రధాన పథకాలను కాంగ్రెస్ ప్రకటించింది.గృహ జ్యోతి యోజన ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటును అందజేయడం ఇంటి పెద్దగా ఉండే ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఆర్థిక సాయం ఇవ్వడంతో రాష్ట్రంలో కొటిన్నర మంది మహిళలకు లబ్ధి కలుగుతుంది ఇది బాగా వర్కౌట్ అయినట్లు కనిపింది. ఇక అన్న భాగ్య కార్యక్రమంతో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు నెలకు 10 కిలోల ఉచిత బియ్యం అందజేయడం వంటి కార్యాక్రమం ప్రజల్లోకి బలంగా వెళ్లింది.యువ నిధి హామీ డిగ్రీ చదివిన నిరుద్యోగులకు నెలకు మూడు వేలు,డిప్లొమా చేసి, ఉద్యోగం రాని వారికి పదిహేను వందల నిరుద్యోగ భృతి కూడా కాంగ్రెస్ విజయానికి కారణమైంది. లాప్ట్ బట్ నాట్ లీస్ట్ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం హామీ కూడా హస్తం పార్టీకి ఓట్లను తెచ్చిపెట్టాయి.
ఇక కాంగ్రెస్ మేనిఫెస్టో రూపకల్పన వెనుక ఓ మాజీ ఐఏఎస్ అధికారి ఉన్నారు. అయనే తమిళనాడకు చెందిన శశికాంత్ సెంథిల్. 2020లో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టంను నిరసిస్తూ సెంథిల్ తన ఐఏఎస్ పదవికి రాజానామా చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. గతంలో రాయచూర్, చిత్రదుర్గ జిల్లాలకు కలెక్టర్‌గా పనిచేసిన సెంథిల్‌కు ప్రజల సమస్యలపై మంచి అవగాహన ఉంది. ఆ అను భవంతోనే..వార్‌రూం ద్వారా కన్నడిగుల సమస్యలను తెలుసుకున్నారు. అలా సేకరించిన ఫీడ్‌బ్యాక్‌ను మేనిఫెస్టోలా రూపొందించేందుకు భారీ కసరత్తే చేశారు. అంతకు ముందే కాంగ్రెస్‌కు ఉన్న బలాలు, అనుకూలత లను బేరీజు వేసుకున్న ఆయన..బలహీనతలు, ప్రమాదాలను అధిగమించేలా ఐదు సూత్రాలను అధిష్ఠానం ముందు పెట్టారు. బజరంగ్‌దళ్‌పై నిషేధం అంశంపై కాంగ్రెస్ చేసిన వాగ్దానం వెనక కూడా వార్‌రూం ఫీడ్‌బ్యాకే ఉంది.ఇక తాజా మాజీ సీఎం బస్వరాజ్ బొమ్మైపై పేటీఎం సీఎం, 40 పర్సంటేజ్ సీఎం అంటూ తెరపైకి తెచ్చింది కూడా శశికాంత్ సెంథిల్ ఆధ్వర్యంలోని వార్ రూం పనే అంటున్నాయి కన్నడ కాంగ్రెస్ వర్గాలు.
ఇక ఈ వ్యవస్థలో మార్పును తీసుకుని రావడం అసాధ్యమని భావించడం వల్లే తాను రాజీనామా చేస్తున్నట్లు శశికాంత్ తెలిపారు.వ్యవస్థను మార్చలేకపోయిన సమయంలో.. హోదాలో కొనసాగడం అనైతికమని తాను మనసా, వాచా భావిస్తున్నానని చెప్పారు. అనైతికత్వానికి పాల్పడటం తనకు ఇష్టం లేదని, అందువల్లే అఖిల భారత సర్వీసుల నుంచి వైదొలగుతున్నట్లు తెలిపారు.
2009 బ్యాచ్ కర్ణాటక క్యాడర్ కు చెందిన శశికాంత్ సెంథిల్ తమిళియన్. తమిళనాడుకు చెందిన ఆయన మూడేళ్లుగా దక్షిణ కన్నడ జిల్లా డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తున్నారు. 2009న జరిగిన సివిల్ సర్వీస్ పరీక్షల్లో శశికాంత్ సెంథిల్ జాతీయ స్థాయిలో తొమ్మిదవ ర్యాంకును సాధించారు. విధి నిర్వహణలో నిక్కచ్చిగా ఉంటారనే పేరుంది. ముక్కుసూటిగా వ్యవహరిస్తారని, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తల వంచరని చెబుతుంటారు. డైనమిక్ అధికారిగా ఆయన గురించి చెబుతుంటారు దక్షిణ కన్నడ ప్రజలు. ప్రత్యేకించి మున్సిపల్ పరిపాలనపై శశికాంత్ సెంథిల్ కు మంచి పట్టు ఉంది. పట్టణాలు, నగరాల అభివృద్ధి అంశాలపై ఆయన కొన్ని వ్యాసాలను కూడా రాశారు.
బీజేపీ విధానాలకు వ్యతిరేకించిన శశికాంత్ సెంథిల్ అత్యున్నత సర్వీస్‌ల నుంచి తప్పుకున్నారు.తమిళనాడు కాంగ్రెస్‌లో చేరారు. కర్ణాటక కాంగ్రెస్ వార్ రూం ఇన్ ఛార్జ్‌గా బాధ్యతలు చేపట్టి తన టీంతో హస్తానికి అఖండ విజయాన్ని చేకూర్చిపెట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com