Tamil nadu : బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. 10 మంది మృతి,

Tamil nadu : బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. 10 మంది మృతి,
తమిళనాడు- కర్ణాటక సరిహద్దుల్లో భారీ ప్రమాదం

తమిళనాడులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా, మరో 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. కర్ణాటక – తమిళనాడు సరిహద్దులోని హోసూరు సమీపంలో గల అత్తిపల్లి బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది.

టపాకాయలను కంటైనర్ వాహనంలో లోడ్ చేస్తుండగా విద్యుత్ హై టెన్షన్ వైర్లు తగలడంతో ప్రమాదం జరిగింది. దీంతో పది మంది మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా టపాకాయల గోడౌన్ లో పనిచేస్తున్న వారుగా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుంది. మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 20 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అగ్ని ప్రమాదంలో కోటి రూపాయల విలువైన బాణాసంచాతో పాటు 1 క్యాంట్రో, 2 బొలెరోలు, 7 బైక్‌లు కూడా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంతో అత్తిపల్లి మార్గంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. బాణసంచా ప్రమాదంపై తదుపరి విచారణ జరుపుతామని వారు తెలిపారు. క్యాంటర్‌లో బాణాసంచా తీస్తుండగా మంటలు చెలరేగడంతో కొద్దిసేపటికే దుకాణం, గోదాములకు వ్యాపించాయి. అతి తక్కువ కాలంలోనే భారీ నష్టం సంభవించింది. అయితే గోడౌన్‌కు అనుమతి ఉందని చెబుతున్న అధికారులు వారు అన్ని నిబంధనలు పాటించారా లేదా అనేది మాత్రం మంటలు ఆర్పిన తర్వాత తనిఖీలు చేస్తామని చెప్పారు.


కాగా ఈ ఘటనలో షాపు యజమానికి కూడా కాలిన గాయాలయ్యాయి.ప్రస్తుతం అగ్నిప్రమాదంపై ఖచ్చితమైన సమాచారం లేదు. FSL బృందం ధృవీకరణ తర్వాత మరిన్ని వివరాలు అందజేస్తామన్నారు. అదేవిధంగా షాపు లైసెన్స్‌ను పరిశీలిస్తున్నామని పోలీసులు, సంబంధిత అధికారులు తెలిపారు. బాణసంచా ప్రమాదంపై తదుపరి విచారణ జరుపుతామని వారు తెలిపారు.

ప్రతియేటా దీపావళి దగ్గరకి వస్తోంది అంటే చాలు పటాకులు సందడి మొదలవుతుది. కానీ చాలా సార్లు ఇదే సమయం ప్రమాదాలకు నిలయమవుతుంది. అత్యధిక సమయాల్లో అనుమతి లేకుండానే బాణాసంచా తయారీ కోసం ప్రయత్నించడం ప్రమాదాలకు కారణమవుతుంది. లైసెన్స్ తీసుకున్న యూనిట్లలో కూడా ప్రమాణాలకు విరుద్ధంగా పరిమితికి మించి ఉత్పత్తి కోసం చేసే యత్నాల్లో నిబంధనలు అతిక్రమించడం మరో కారణం.

Tags

Read MoreRead Less
Next Story