Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది కూలీలు మృతి.

ట్రాక్టర్​ను ఢీకొట్టిన లారీ-

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీర్జాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మీర్జాపూర్ కచ్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్కా స్టాప్ సమీపంలో గురువారం అర్ధరాత్రి 1గంట సమయంలో ట్రాక్టర్ ను ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10మంది మరణించగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం అనంతరం క్షతగాత్రులను చికిత్స నిమిత్తం బనారస్ హిందూ యూనివర్సిటీ ట్రామా సెంటర్ కు తరలించారు. ప్రమాదం సమయంలో ట్రాక్టర్ పై మొత్తం 13 మంది కూలీలు ప్రయాణిస్తున్నారు. వీరంతా రోజువారి కూలీలు. భదోహ జిల్లాలోని తివారీ గ్రామం నుంచి పని పూర్తి చేసుకొని ట్రాక్టర్ పై కూలీలు వారణాసి వైపు వెళ్తున్నారు.10 Labourers Killed In Road Accident In Uttar Pradeshs Mirzapur

కచ్వా సరిహద్దు జిట్ రోడ్ లో వెనుక నుంచి వచ్చిన ట్రక్కు ట్రాక్టర్ ను బలంగా ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ లోని పది మంది కూలీలు అక్కడికక్కడే మరణించారు. పోలీసులు ఘటన స్థలంకు చేరుకొని మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. 13 మందికూడా రోజువారీ కూలీలు. వీరి మృతితో ఆ ప్రాంతంలో విషాదం అలముకుంది.

ట్రక్కు, బస్సు ఢీ- 10మంది మృతి

ఉత్తర్​ప్రదేశ్​లోని బులంద్‌షహర్ జిల్లాలో ఆగస్టులో ఇలాంటి ఘోర రోడ్డు ప్రమాదే జరిగింది. ఆ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. మరో 27 మందికి గాయాలయ్యాయి. సేలంపుర్ ప్రాంతంలో బదాయూ - మీరట్ రహదారిపై ఎదురుగా వస్తున్న ట్రక్కును బస్సు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 10 మంది మృతి చెందినట్లు జిల్లా మెజిస్ట్రేట్ చంద్ర ప్రకాశ్ సింగ్ తెలిపారు. మరో 27 మంది గాయపడినట్లు పేర్కొన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించామని చెప్పారు. పరిస్థితి విషమంగా ఉన్న మరో నలుగురిని మీరట్ మెడికల్ కాలేజీకి తరలించినట్లు చికిత్స అందించినట్లు తెలిపారు.

Tags

Next Story