Maharashtra : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం

Maharashtra : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం
12 మంది మృతి, 23మందికి గాయాలు

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై ఆదివారం తెల్లవారుజామున మినీ బస్సు, కంటైనర్‌ను ఢీకొట్టడంతో 12 మంది అక్కడిక్కడే మరణించారు. 23 మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో ప్రైవేట్ బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారని సమాచారం.

ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలోని వైజాపూర్ ప్రాంతంలో సమృద్ధి ఎక్స్ ప్రెస్ వేపై వేగంగా దూసుకొచ్చిన ఓ ప్రైవేటు మినీ బస్సు అదుపుతప్పి కంటైనర్ ను ఢీకొట్టింది. ఈ ఘటన 2023 అక్టోబర్ 15వ తేదీ ఆదివారం అర్థరాత్రి 12.30 గంటల సమయంలో చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ముంబయికి 350 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగమే ప్రమాదానికి కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. వేగంగా బస్సు నడుపుతోన్న డ్రైవర్.. ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి కంటెయినర్‌ను ఢీకొట్టాడు. దీంతో బస్సులోని ఓ భాగం నుజ్జునుజ్జయ్యింది. మృతుల్లో నాలుగు నెల చిన్నారి, ఆరుగురు మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. మరో 23 మంది గాయపడ్డారని, వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.


నాశిక్ జిల్లాలోని ఇందిరానగర్ కు చెందిన యాత్రికులు బుల్దానాలోని సైలానీ బాబా దర్శనానికి వెళ్లారు. దర్శనం చేసుకున్నాక ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. అయితే, యాత్రికులతో వస్తున్న ట్రావెలర్ బస్ నిలిచి ఉన్న ట్రక్కును వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాలుగు నెలల చిన్నారి, డ్రైవర్ సహా బస్సులోని 12 మంది అక్కడిక్కడే మరణించారు. ప్రమాద శబ్దాలు విన్న స్థానికులు.. ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు. క్షతగాత్రులను సమీపంలోని ఘాటీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 35 ప్రయాణికులు ఉన్నారని, మృతి చెందిన వారిలో ఐదుగురు పురుషులు, ఆరుగురు మహిళలతోపాటు ఓ చిన్నారి కూడా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరోవైపు ఈ ఎక్స్ప్రెస్ వేపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు సుమారు 800ప్రమాదాలు జరిగినట్లు అధికారిక సమాచారం. ఇటీవల ఈ ప్రమాదాలపై ఇటీవల స్పందించిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ వింతైన వ్యాఖ్యలు చేశారు. సమృద్ధి ఎక్స్ప్రెస్వే రోడ్లు ఎలాంటి వంపులు లేకుండా తిన్నగా ఉంటాయని.. అందుకే డ్రైవర్లకు నిద్రమత్తుతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అయితే కారణం ఏదైనా సరే.. ఈ ప్రమాదాలను కట్టడి చేయాల్సి ఉందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story