Manipur violence: ఆర్మీని ఎదిరించి మిలిటెంట్లను విడిపించారు

Manipur violence: ఆర్మీని ఎదిరించి మిలిటెంట్లను విడిపించారు
12 మంది మిలిటెంట్ల కోసం 1200 మంది గ్రామస్తుల ఆందోళన

మణిపూర్ రాష్ట్రంలో హింసను అదుపులో పెట్టడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. శనివారం కేంద్ర హోం మంత్రి ఢిల్లీలో రాష్ట్ర పరిస్థితులపై అఖిలపక్ష సమావేశం నిర్వహించగా, ఇంపాల్ ఈస్ట్ లో మరొక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. స్థానికులే తీవ్రంగా ప్రతిఘటించి సైన్యం 12 మంది విడుదల చేయాల్సిన పరిస్థితి తీసుకుచ్చారు. దీంతో వేరే అవకాశం లేక ప్రాణ నష్టం రక్తపాతం జరగకుండా ఆర్మీ కీలక నిర్ణయం తీసుకొని 12 మంది మిలిటెంట్లను అక్కడికక్కడే వదిలేసింది.

మహిళల నేతృత్వంలో సైన్యాన్ని చుట్టుముట్టిన స్థానికులు 12 మంది మిలిటెంట్లను తమతో తీసుకెళ్లిన ఘటన మణిపూర్‌ రాజధానిలో జరిగింది. ఇంఫాల్‌ ఈస్ట్‌లోని ఇథమ్‌లో మిలిటెంట్లు దాక్కున్నారనే సమాచారంతో సైనికులు గ్రామాన్ని చుట్టుముట్టాయి. పెద్దసంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రీని సైనికులు స్వాధీనం చేసుకున్నారు. కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే విషయం తెలుసుకున్న గ్రామస్థులు, మహిళ నేతృత్వంలో సుమారు 12నుంచి 15 వందల మంది ఆర్మీ వాహనాలను చుట్టుముట్టారు. వీరంతా ఆర్మీ వాహనాలను ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. అయితే తమకు అడ్డుకోవద్దని సైన్యం హెచ్చరించినప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు. కొన్ని గంటలపాటు ప్రతిస్తంభన అలాగే కొనసాగడంతో అధికారులు రంగంలోకి దిగారు. పరిస్థితి చేయిదాటిపోకముందే 12 మంది మిలిటెంట్లను వదిలేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండానే ఉద్రిక్తపరిస్థితి సద్దుమనిగింది.

ఈ ఘటనలో మైటీ వర్గానికి చెందిన మిలిటెంట్‌ గ్రూప్‌ కంగ్లీ యావోల్‌ కన్నా లుప్‌ సభ్యులు తప్పించుకున్నారు. వారిలో ఓ వ్యక్తి 2015లో 6 డోగ్రా రెజిమెంట్‌పై జరిగిన దాడితో సహా అనే ఘటనల్లో అతడు సూత్రధారి అని తెలిపారు.

మణిపూర్ రాష్ట్రంలో మెయిటీ తెగకు ఎస్టీ హోదా ఇవ్వడాన్ని నిరసిస్తూ గత నెల 3న కుకీలు ఆందోళనలకు దిగిన విషయం తెలిసింది. అవికాస్తా హింసాత్మకంగా మారడంతో రాష్ట్రంలో ఇప్పటికీ అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ హింసకాండలో ఇప్పటివరకు వందమందికి పైగా ప్రజలు మరణించారు వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story