Bijapur Encounter: కాల్పుల మోతతో దద్దరిల్లిన ఛత్తీస్‌గఢ్

బీజాపూర్-దంతేవాడ అంతర్- జిల్లా సరిహద్దులోని పశ్చిమ బస్తర్ డివిజన్ ప్రాంతంలో నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు జరిగిన కాల్పుల్లో 12 మంది మావోయిస్టు కేడర్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఎదురు కాల్పుల్లో ముగ్గురు బీజాపూర్ DRG సిబ్బంది మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. హెడ్ కానిస్టేబుల్ మోను వాడారి, కానిస్టేబుల్ దుకారు గొండే, జవాన్ రమేష్ సోడిగా గుర్తించారు. అలాగే, మరో ఇద్దరు బీజాపూర్ DRG సిబ్బంది గాయపడ్డారు. వారిని స్థానిక ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు.
ఇక, SLR రైఫిల్స్, INSAS రైఫిల్స్, 303 రైఫిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రాంతంలో ప్రస్తుతం నిరంతర సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. అదనపు బలగాలను, తగినంత బలగాలు మోహరిస్తున్నాయి. అటవీ ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టు ముట్టాయి.సంఘటన ప్రాంతం నుంచి మావోయిస్టుల మృతదేహాలతోపాటు ఎల్‌ఎంజీ మెషిన్ గన్, ఏకే-47 రైఫిల్, ఎస్‌ఎల్‌ఆర్, ఇన్సాస్, 303 రైఫిల్, పెద్దఎత్తున ఆయుధ, పేలుడు సామగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి’’ అని వివరించారు. ఎన్‌కౌంటర్‌లో ప్రజావిముక్తి గెరిల్లా సైన్యం (పీఎల్‌జీఏ) కంపెనీ నంబరు-2 కమాండర్ మొడియం వెల్ల ఎలియాస్ మంగు మొడియం మృతి చెందాడు. నిఘా విభాగానికి కమాండర్‌గా పనిచేస్తున్న ఈయన గంగలూరు ఏరియాలో కీలకంగా వ్యవహరిస్తూ అనేక దాడుల్లో పాల్గొన్నట్లు ఎస్పీ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

