Ujjain Rape : ఆపదలో ఆదుకోమంటే.. చేతిలో రూ. 50, 100 పెట్టిన జనం

మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో పన్నెండేళ్ల బాలికపై జరిగిన ఘోర అత్యాచార ఘటనలో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సోనీ అనే ఆటోడ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు జీవన్ ఖేరీ ప్రాంతంలో ఆటో ఎక్కినట్లు సీసీటీవీలో నమోదైంది. అదే ఆటోలో రక్తపు మరకలు గుర్తించామని వీటిని ఫోరెన్సిక్ నిపుణులు పరీక్షిస్తున్నారని అధికారులు తెలిపారు. ఆటోడ్రైవర్ ను విచారిస్తూ ఆధారాల సేకరణ కోసం ఘటనాస్థలానికి తీసుకెళ్లగా తప్పించుకునే ప్రయత్నం చేయగా పోలీసులు వెంటనే స్పందించి నిర్బంధించారు. ఈ ఘోర అకృత్యంలో మరో అయిదుగురు అనుమానితుల్ని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కామాంధుల చేతికి చిక్కిన బాలిక ఆ తర్వాత తీవ్ర రక్తస్రావం కావడంతోసాయం కోసం కాలినడకన దాదాపు 8 కిలోమీటర్లు వెళ్లినట్లు తేలింది. బాధితురాలు ఇంకా దిగ్భ్రాంతి నుంచి తేరుకోలేదని ఆమెది మధ్యప్రదేశ్ లోని సాత్నా జిల్లాగా గుర్తించారు.
అత్యాచారానికి గురైన 12 ఏళ్ల బాలిక ఉజ్జయిని రోడ్లపై సాయం కోసం తిరిగిన వీడియో మానవత్వానికి మాయని మచ్చగా నిలిచింది. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఈఘటనలో పోలీసులు ముమ్మరంగా విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఓ ఆటో డ్రైవర్‌తోపాటు మరోముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. దీనస్థితిలోని బాలిక సాయం కోసం తిరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఈ ఫుటీజీలో బాధితురాలు చెప్పులు లేకుండా సాయం కోసం 8 కిలోమీటర్లు నడిచినట్లు తేలింది. అరెస్ట్‌చేసిన ఆటో డ్రైవర్‌ను రాకేష్‌గా గుర్తించారు. బాధితురాలు జీవన్ ఖేరీ వద్ద ఈ ఆటోనే ఎక్కిందని, ఆ సీసీటీవీ వీడియో కూడా లభించినట్లు పోలీసులు తెలిపారు. అంతేగాక ఆటోలు రక్తపు మరకలు కూడా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఆటోను ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపినట్లు వెల్లడించారు. అయితే అరెస్ట్ అయిన మిగతా ముగ్గురు కూడా ఆటో డ్రైవర్లనే తేలింది. బాలికను చూసిన కొందరు పొమ్మంటూ సైగలు కూడా చేయడం కూడా వీడియో కనిపించింది. చివరికి ఆ బాలిక ఒక ఆశ్రమం ఎదుటకు రాగా రాహుల్ శర్మ అనే పూజారి గమనించి ఆమెకు దుస్తులు అందించాడు.

బాధితురాలు నిస్సహక స్థితిలో ఉండటంతో వెంటనే ఆసుపత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ బాలికపై అత్యాచారం జరిగిందని వైద్య పరీక్షల్లో తేలడంతో వెంటనే ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసి విచారణ చేపట్టింది. ప్రస్తుతం ఆ బాలికకు ఇండోర్ ఆస్పత్రిలో చికిత్స నిర్వహిస్తున్నామని, ఆమె ప్రాణానికి ప్రమాదం లేదని మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com