Delhi : వణుకుతున్న ఉత్తరాది..విమాన సర్వీసులకు అంతరాయం

Delhi :  వణుకుతున్న ఉత్తరాది..విమాన సర్వీసులకు అంతరాయం
134 విమానాలు, 22 రైళ్ల రాక‌పోక‌ల‌కు అంత‌రాయం..

ఢిల్లీలో పొగమంచు కారణంగా రహదారులపై రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం కూడా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉదయం 8.30 నుంచి 10 గంటల వరకు ఢిల్లీకి చేరుకోవలసిన ఐదు విమానాలను జైపూర్‌కు మళ్లించినట్టు విమానాశ్రయం అధికారులు వెల్లడించారు. ఈ సమాచారం ప్రయాణికులకు అందించారు. మంగళవారం ఉదయం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. పొగమంచు ఆవరించడంతో విజిబిలిటీ 150 మీటర్లకు పరిమితమైందని వాతావరణ శాఖ తెలిపింది.

ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో 500 లేదా అంతకంటే తక్కువ విజిబిలిటీ నమోదవ్వగా పాలంలో 100, సఫ్దర్‌గంజ్‌లో 200 మీటర్లు నమోదైంది. నిన్నటివరకు ఢిల్లీలో విజిబిలిటీ 0 మీటర్లకు పడిపోయిన విషయం తెలిసిందే . ఇదిలా ఉండగా పంజాబ్, హర్యానా, తూర్పు ఉత్తర ప్రదేశ్, పశ్చిమ మధ్యప్రదేశ్, ఒడిశా లోని అనేక ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా కమ్ముకుంటోంది. చండీగఢ్, బీహార్, త్రిపురలో తక్కువ మోతాదులో మంచు ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. ఢిల్లీలో మరో ఐదు రోజులు వాతావరణ పరిస్థితి ఎలా ఉంటుందో వాతావరణ శాఖ నివేదిక విడుదల చేసింది.


ఉత్తరాదిన చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. దేశరాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. గురువారం ఉదయం ఉష్ణోగ్రతలు 6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. దీంతో రాజధాని ప్రాంతాన్ని దట్టమైన పొగ మంచు కమ్మేసింది. విజిబిలిటీ దాదాపు జీరోకు పడిపోయింది. రోడ్డుపై వాహనాలు కనిపించని పరిస్థితి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విమానాలు, రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

గురువారం ఉదయం పాలెం విమానాశ్రయంలో విజిబిలిటీ 25 మీటర్లుగా ఉంది. దీంతో దాదాపు 134 జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీకి రాకపోకలు సాగించే విమానాల్లో కొన్నింటిని దారి మళ్లించగా.. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అటు రైళ్ల రాకపోకలపై కూడా పొగ మంచు తీవ్ర ప్రభావం చూపించింది. సుమారు 22 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

గురువారం ఉదయం 5:30 గంటలకు ఢిల్లీలోని సఫ్ధార్‌జంగ్‌ అబ్జర్వేటరీలో విజిబిలిటీ 50 మీటర్లకు పడిపోయింది. పంజాబ్‌, హర్యానా, మధ్యప్రదేశ్‌, యూపీలో దృశ్యమానత 50 మీటర్ల నుంచి 25 మీటర్ల వరకూ ఉంది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, హర్యాణా, పంజాబ్‌, చండీగఢ్‌లలో 31వ తేదీ వరకూ పొగమంచు అతితీవ్రంగా ఉండొచ్చని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

Tags

Read MoreRead Less
Next Story