Tamil Nadu: తమిళనాడులో కల్తీసారా విషాదం

18 మంది మృతి..ఆస్పత్రిలో 60 మంది

తమిళనాడులో కల్తీసారా తాగి 16 మంది మృత్యువాతపడ్డారు. 70 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. కాళ్లకురిచి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అందులో 25 మంది సీరియస్ గా ఉన్నారు. మృతదేహాలతో సారా కేంద్రం వద్ద గ్రామస్థులు ఆందోళన నిర్వహించారు. ఆగ్రహంతో సారా అమ్మిన దుకాణాన్ని గ్రామస్థులు ధ్వంసం చేశారు. చికిత్స పొందుతూన్న వారికి మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదేశించారు. అలర్ట్ అయిన ప్రభుత్వం ఈ ఘటనపై వెంటనే విచారణ చేపట్టాలని పోలీసు శాఖను ఆదేశించింది. కల్లకూరిచి ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలని… రాష్ట్రంలో కల్తిసారా అడ్డాగా మారిందని మాజీ సీఎం పళణి స్వామీ విమర్శించారు.

ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. కల్తీ సారా విక్రయాలపై గ్రామస్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. కల్తీ మద్యం ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై విచారణ చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరపాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు.

ఈ కల్తీ మద్యం ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ తీవ్రంగా స్పందించారు. కేసును క్షుణ్ణంగా విచారించాలని క్రైమ్ బ్రాంచ్- క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం(సీబీసీఐడీ)ని సీఎం స్టాలిన్ ఆదేశించారు. కళ్లకురిచ్చి జిల్లా కలెక్టర్ శ్రవణ్ కుమార్ జాదావత్‌ను బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఎంఎస్ ప్రసాద్‌ను నియమించారు. జిల్లా ఎస్పీ సమై సింగ్ మీనాని కూడా తొలగించి, రజత్ చతుర్వేదికి బాధ్యతలు అప్పగించారు. మరోవైపు, జిల్లా ప్రొహిబిషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ యూనిట్‌కు చెందిన డీఎస్సీ తమిళ్ సెల్వన్ నేతృత్వంలోని టీమ్‌ను సస్పెండ్ చేశారు. మంత్రులు ఈవీ వేలు, ఎం సుబ్రమణ్యం కళ్లకురిచ్చి ఆస్పత్రిని సందర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధితుల కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు.

Tags

Next Story