Rajasthan : కోటాలో మరో ఆత్మ హత్య

రాజస్థాన్ రాష్ట్రంలోని కోటా..వివిధ రకాలైన పోటీ పరీక్షలకు ప్రధాన కేంద్రంగా పేరు. కానీ అదే ఇప్పుడు ఆత్మ హత్యలకు కూడా నిలయంగా మారింది. తాజాగా అక్కడ మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోటాలో గడిచిన వారం రోజుల వ్యవధిలో విద్యార్ధి ఆత్మహత్య నమోదవ్వడం ఇది మూడోది. ఇతనితో కలిసి ఈ యేడాది ఇప్పటివరకు 21 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. గత యేడాది మరణాలతో పోలిస్తే ఈ యేడాది ఈ సంఖ్య ఎప్పుడో దాటిపోయింది.
రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థులు వరుస ఆత్మహత్యలు ఆగడం లేదు. మానసిక ఒత్తిడి, చదవు భయంతో బంగారు భవిష్యత్తును చేజేతులారా చిదిమేస్తున్నారు. వారానికి ఒక ఆత్మహత్య కేసు నమోదవ్వడం కలవరపెడుతున్నాయి.
వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్‌లోని అజంఘర్‌కు చెందిన 17 ఏళ్ల మనీష్ ప్రజాపత్ ఆరు నెలల కిత్రం కోటాకు వచ్చాడు. వివిధ ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (జేఈఈ) కోసం ప్రిపేర్ అవుతున్నారు. గురువారం ఉదయం తన హాస్టల్ రూమ్‌లో విగతజీవిగా కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుని వద్ద ఎలాంటి సుసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని, ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు పేర్కొన్నారు.
గత ఏడాది ఇదే పట్టణంలో 15 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఏడాది బలవన్మరణానికి పాల్పడిన విద్యార్థుల సంఖ్య ఇప్పటికే 21కి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది అఖిల భారత స్థాయిలో జరిగే ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఇచ్చే కేంద్రాలకు కోటా ప్రసిద్ధి. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి వేల మంది విద్యార్థులు ఇక్కడ కోచింగ్ కోసం వస్తుంటారు. ఈ ఏడాది దాదాపు 2.5లక్షల మంది శిక్షణ తీసుకుంటున్నట్లు అంచనా. ఈ క్రమంలోనే చదువులో ఒత్తిడి వల్ల అక్కడ విద్యార్థులు ఇలా బలవన్మరణానికి పాల్పడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నా పోలీసులు ఇప్పటి వరకు నిర్ధరాంచలేదు. అయితే, వాస్తవ సంఖ్య ఇంతకంటే ఎక్కువే ఉంటుందని అంచనా.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com