Fake IPS: రెండున్నర లక్షలకు ఐపీఎస్ ఆఫీసర్ ఉద్యోగం
ఉద్యోగం పేరుతో మోసం చేసిన ఉదంతం బీహార్లోని జాముయ్లో వెలుగు చూసింది. కొందరు మోసగాళ్ళు రూ. రెండు లక్షలు తీసుకొని ఓ యువకుడిని బురిడీ కొట్టించారు. నకిలీ ట్రైనీ ఐపీఎస్ని జాముయి సబ్ ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేయడంతో అసలు విషయం బట్టబయలైంది. ఈ ఘరానా మోసం వెనుక ఏ ముఠా ఉందో తెలుసుకోవడానికి పోలీసులు ఈ మొత్తం కేసును దర్యాప్తు ప్రారంభించారు.
అరెస్టయిన నకిలీ ఐపీఎస్ని విచారించగా.. రెండు లక్షలు ఈ జాబ్ ఇచ్చారని.. యూనిఫారంతో పాటు పిస్టల్ కూడా ఇచ్చారని పోలీసులకు తెలిపాడు. అన్నింటినీ సంపాదించుకొని నాలుగు రోజుల క్రితం తాను ఐపీఎస్ అయ్యానని చెప్పాడు. వాస్తవానికి, జముయి జిల్లా సికంద్రా పోలీస్ స్టేషన్ పరిధిలో యూనిఫాంలో బైక్ పై హ్యాపీ గా తిరిగేస్తున్న మిథిలేష్ మాంఝీ యువకుడ్ని బీహార్ లోని జాముయ్ పోలీసులు పట్టుకున్నారు. అతని వయస్సు 18 సంవత్సరాలు. చిన్న పిల్లలప్పుడు పోలీస్ యూనిఫాం కొనుక్కుంటే సరదాగా ఉంటుంది కానీ.. ఈ వయసులో పోలీస్ డ్రెస్ కొనుక్కుని వేసుకుంటే మోసం కిందకేసు పెడతారని సున్నితంగా హెచ్చరించారు. అత్యంత అమాయకంగా కనిపిస్తున్న ఆ యువకుడు తానే ఐపీఎస్ ఆఫీసర్నని ఎదురుదాడికి దిగాడు.
దీంతో కేసేనని ఠాణాకు తీసుకెళ్లిన పోలీసులు యువకుడ్ని విచారించడం మొదలు పెట్టారు. యువకుడి కథనం ప్రకారం.. ఐపీఎస్ ఆఫీసర్ పోస్టును రూ. రెండు లక్షలకు కొనుక్కున్ననని చెప్పాడు. ఇటీవల ఓ జలపాతం వద్దకు టూర్ కు వెళ్లినప్పుడు అక్కడ ఓ యువకుడు పరిచయం అయ్యాడు. మాయ మాటలు చెప్పి బురిడీ కొట్టించాడు. తక్కువ ధరకే ఐఏఎస్ ని చేస్తానని చెప్పాగానే యువకుడు ఎగిరి గంతేశాడు. తనకు అందరూ తెలుసని .. ఇట్టే ఉద్యోగం ఇప్పిస్తానని మోసగాడు యువకుడిని నమ్మబలికాడు. ఫోన్లు మాట్లాడినట్లుగా నటించిన మోసగాడు.. రెండు లక్షలకు ఐపీఎస్ ఉద్యోగం వస్తుందని.. రెండున్నర రోజుల్లోనే తెచ్చివ్వాలన్నాడు. ఆ యువకుడు బంధువుల్ని వేధించి .. రెండు లక్షలు అప్పు తీసుకొచ్చి మోసగాడికి ఇచ్చాడు. అనంతరం మోసగాడు.. యూనిఫాంతోపాటు నకిలీ పిస్టల్ కూడా ఇచ్చినట్లు తెలిపారు. యువకుడు ఖైరా పోలీస్ స్టేషన్ ప్రాంతం నుంచి హల్సీ పోలీస్ స్టేషన్ పరిధిలోని తన ఇంటికి వెళ్తున్నట్లు సమీప గ్రామస్థులు, ప్రత్యక్ష సభ్యుల నుంచి సమాచారం అందిందని సికంద్రా పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికే చర్యలు తీసుకున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com