Cyber Crime: 8 ఫోన్లు, 84 అకౌంట్లతో భారీగా డబ్బు దోపిడీ

Cyber Crime:  8 ఫోన్లు, 84 అకౌంట్లతో భారీగా డబ్బు దోపిడీ
వెలుగులోకి రూ.854 కోట్ల భారీ స్కామ్

ఇప్పటి వరకు సైబర్ క్రైమ్ లో పదో పాతికో కోట్లు కొల్లగొట్టారు అన్న వార్తలు విన్నాం. కానీఇప్పుడు కర్ణాటకలో బయటపడిన చిన్నా చితకా సైబర్ క్రైమ్‌ కాదు. బెంగళూరులోని యలహంక ప్రాంతంలో ఉన్న ఓ ఇంటిపై దాడులు చేసిన ఐటీ అధికారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఒక గదిలో ఉన్న బెడ్ కింద ఏకంగా రూ.854 కోట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు యువకులు చేసిన ఓ భారీ సైబర్ క్రైమ్ వెలుగులోకి రావడంతో పోలీసులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఇద్దరు యువకులు, 8 ఫోన్లతో దాదాపు 84 బ్యాంక్ అకౌంట్ల ద్వారా మొత్తం లావాదేవీలు నడిపినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఇద్దరితో పాటు మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేసి మరింత లోతైన దర్యాప్తు ప్రారంభించారు.

కర్ణాటక యలహంకకు చెందిన మనోజ్ శ్రీనివాస్‌, ఫణీంద్ర అనే ఇద్దరు యువకులు పేరు లేకుండానే ఓ కంపెనీని స్థాపించారు. కంపెనీలో ఇద్దరు వ్యక్తులను ఉద్యోగులగా కూడా తీసుకున్నారు. వారికి 8 మొబైల్ ఫోన్లు ఇచ్చి.. పగలు రాత్రి తేడా లేకుండా పని అప్పగించారు. అయితే సెప్టెంబరులో వెలుగులోకి వచ్చిన ఈ కేసులో రంగంలోకి దిగిన బెంగళూరు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు.. మనోజ్‌, ఫణీంద్ర సహా ఆరుగురిని అరెస్ట్‌ చేశారు. ఆ కేసులో విచారణ జరిపిన సైబర్ క్రైమ్ పోలీసులకు దిమ్మ తిరిగే నిజాలు వెల్లడయ్యాయి. దీంతో వారు ఐటీ అధికారులను రంగంలోకి దించగా.. భారీ మొత్తంలో డబ్బు పట్టుబడింది.


అయితే రూ.8.5 లక్షల మోసంపై ఓ 26 ఏళ్ల యువతి పోలీసులకు చేసిన ఫిర్యాదుతో ఇంతటి భారీ కుంభకోణం బయటికి వచ్చింది. తక్కువ మొత్తంలో పెట్టుబడి పెడితే.. ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని తనను ఈ ఉచ్చులోకి లాగి మోసం చేశారని బాధితురాలు బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో అసలు కేసు ప్రారంభం అయింది. అయితే బాధితురాలు ఇచ్చిన ఆధారాలతో కేసు విచారణను ప్రారంభించిన పోలీసులకు.. కొద్దికొద్దిగా అసలు విషయం తెలిసింది. ఆ వివరాలతో బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులు.. నిందితుల నెట్‌వర్క్‌ను పట్టుకున్నారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన తాజాగా విచారించగా అసలు గుట్టు బయటపడింది.

గత రెండేళ్లలో 84 బ్యాంకు ఖాతాల ద్వారా రూ.854 కోట్ల లావాదేవీలు జరిపినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. సెప్టెంబర్‌లో బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులు ఆ బ్యాంకు ఖాతాలను గుర్తించి స్తంభింపజేశారు. ఈ మనోజ్ శ్రీనివాస్, ఫణీంద్ర నిందితులు వేలాది మందిని మోసం చేసి భారీగా డబ్బును కూడబెట్టినట్లు గుర్తించారు. అయితే వారి బ్యాంకులను స్తంభింపజేసిన సమయంలో వారి ఖాతాలో కేవలం రూ.5 కోట్లు మాత్రమే ఉన్నట్లు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గుర్తించారు. ఇప్పుడు వారి ఇంటిపై దాడులు చేయగా ఏకంగా రూ.854 కోట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.




Tags

Read MoreRead Less
Next Story