Fake pilot :పాపలను పడేయాలని పైలెట్ అవతారం.. కానీ..

Fake pilot :పాపలను పడేయాలని పైలెట్ అవతారం.. కానీ..
కౌన్సిలింగ్ ఇచ్చి, తల్లిదండ్రలకు అప్పగింత

మోసం చెయ్యాడానికి ఏజ్ తో సంబంధం లేదు.. చిన్న వయసులోనే ప్రేమ, పెళ్లి పేరుతో మోసలకు పాల్పడటం ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువై పోయింది. నేను పెద్ద జాబ్ చేస్తున్నానంటూ అటు యువకులు ఇటు యువతులు ఒకరినొకరు మోసం చేసుకునే సంఘటనలు రోజురోజుకీ ఎక్కడో ఒక చోట బయట పడుతూనే ఉన్నాయి. తాజా ఓ యువకుడు తాను పైలెట్ అని చెప్పి ఒకరు కాదు ఏకంగా నలుగురు అమ్మాయిలను మోసం చేశాడు. అయితే అతని పోలీసులు పట్టుకోవడంతో అసలు విషయం బయటకు వచ్చింది.

వివరాళ్లొకి వెళ్తే గుజరాత్ కు చెందిన రక్షిత్ మంగేలా అనే 20 ఏళ్ల యువకుడు హైదరాబాద్ లో ఉన్న తన ప్రియురాలిని కలిసేందుకు వెళుతూ వడోదర ఎయిర్ పోర్ట్ లో అధికారులకు ఎదురు పడ్డాడు. పైలెట్ డ్రస్ లో ఎయిర్ పోర్ట్ లో వెళుతుండగా బోర్డింగ్ సిబ్బందికి అనుమానం వచ్చి విచారించారు. దాంతో తాను ఎయిర్ ఇండియా పైలెట్ ను అంటూ అతను పొంతన లేని సమాధానాలు చెప్పాడు. దీంతో వారు రక్షిత్ ను పోలీసులకు అప్పగించారు. పోలీసు స్టేషన్ లో ఆ యువకుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణలో తెలిసిన అంశాలు విని ఆశ్చర్య పోయారు. రక్షిత్​కు అహ్మదాబాద్, రాజ్​కోట్​, ముంబయితో పాటు నెదర్లాండ్స్​లోనూ ఓ గర్ల్​ఫ్రెండ్ ఉందని పోలీసులు గుర్తించారు. కేవలం అమ్మాయిలను ప్రేమలో పడేసేందుకు రక్షిత్ ఇలా ఫేక్​ పైలట్​ అవతారం ఎత్తాడు. 20 ఏళ్ల వయసులోనే ఇంత మందితో పైలెట్ అని చెప్పి ప్రేమాయణం నడపడంతో పోలీసులే ఆశ్చర్యపోయారు. పైలెట్ డ్రెస్ వేసుకొని విమానంలో ఉండగా ఫోటోలు దిగి వాళ్ళందరికీ ఫోటోలు పంపేవాడిని తెలుసుకున్నారు.

ఉగ్రవాద సంస్థలతో గానీ, ఇతర నిషేధిత సంస్థలతో అతడికి ఎటువంటి సంబంధం లేదని నిర్ధరించుచుకుని, అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రలకు జరిగిన విషయాన్నాంతా చెప్పి అప్పగించారు. అంతేకాకుండా అతని గర్ల్ ఫ్రెండ్స్ కు నేను నకిలి పోలీసును అంటూ అతని చేతే మెసేజ్ కూడా పెట్టించారు.అయితే రక్షిత్ నిజంగానే పైలట్​ కావాలని కలలు కన్నాడని.. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆ కోరిక నెరవేరలేదని పోలీసులు వెల్లడించారు. అయినప్పటికీ​ ముంబయిలోని ఓ ప్రైవేటు సంస్థలో.. రక్షిత్ గ్రౌండ్​ స్టాఫ్ ట్రైనింగ్ తీసుకున్నాడని పేర్కొన్నారు. ఏది ఏమైనా ఇలాంటి ఫేక్ ఐడెంటిటీతో మోసం చేసేవారి పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

Tags

Read MoreRead Less
Next Story