Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మరో కీలక పరిమాణం.. ఒకేసారి 208 మావోల లొంగుబాటు

దేశ వ్యాప్తంగా మావోయిస్టుల లొంగుబాటు కార్యక్రమం కొనసాగుతోంది. ఇటీవల మావో అగ్ర నేత మల్లోజుల వేణుగోపాల్ సారధ్యంలో పలువురు మావోయిస్టులు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఎదుట లొంగిపోయారు. ఆయుధాలు అప్పగించి లొంగిపోయారు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో కూడా మరొక కీలక పరిమాణం చోటుచేసుకుంది.
ఛత్తీస్‌గఢ్‌లోని అబుజ్మద్‌లో ఒకేసారి 208 మంది మావోయిస్టులు లొంగిపోయారు అందులో 153 మంది ఆయుధాలు అప్పగించేశారు. దీంతో ఉత్తర బస్తర్‌లో రెడ్ టెర్రర్ అంతమైంది. ఇక దక్షిణ బస్తర్ నుంచి కూడా మావోలు లొంగిపోవాల్సి ఉందని అదికారులు తెలిపారు. ఇక లొంగిపోయిన మావోయిస్టులకు పునారావాసం కల్పిస్తున్నట్లు అధికారులు చెప్పారు.
208 మావోయిస్టుల్లో 110 మంది మహిళలు కాగా.. 98 మంది పురుషులు ఉన్నారు. వీరిలో కేంద్ర కమిటీ సభ్యుడు, నలుగురు దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు, ఒక ప్రాంతీయ కమిటీ సభ్యుడు, 21 మంది డవిజనల్ కమిటీ సభ్యలు, 61 మంది ఏరియా సభ్యులు ఉన్నారు.
లొంగిపోయిన వారిలో కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న ఉన్నారు.
ఆశన్న బీజాపూర్ మావోయిస్టు కేంద్రకమిటీ సభ్యుడుగా పని చేశారు. లొంగుబాటు నేపథ్యంలో ఆశన్న సహచరులను ఉద్దేశించి చివరి ప్రసంగం చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయుధాలను వదిలిపెడుతున్నాం అని, ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలో ఉండలేమన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com