Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో కీలక పరిణామం..లొంగిపోతున్న మావోలు

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో కీలక పరిణామం..లొంగిపోతున్న మావోలు
X
ఆయుధాలతో లొంగిపోయిన 21 మంది మావోలు

దేశాన్ని నక్సల్స్ రహితంగా మారుస్తామంటూ కేంద్ర నిర్ణయం సత్‌ఫలితాన్ని ఇస్తోంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో వందలాది మంది మావోయిస్టులు లొంగిపోయారు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో కూడా భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. కాంకేర్ జిల్లాలో 13 మంది మహిళలు సహా 21 మంది మావోయిస్టులు లొంగిపోయారని.. నక్సలిజం వెన్నెముక విరిగిపోయిందని ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి అన్నారు. మార్చి 31, 2026 నాటికి భారతదేశాన్ని నక్సల్స్ రహితంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. యువత మావోయిజాన్ని వదిలిపెట్టి.. అభివృద్ధి మార్గాన్ని ఎంచుకోవాలని పిలుపునిచ్చారు. లొంగిపోయిన వారికి పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు

తాజాగా ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లా పోలీసు అధికారుల ఎదుట బుధవారం 51 మంది మావోయిస్టులు లొంగిపోయారు. పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న 9 మంది మహిళలు సహా మొత్తం 51 మంది మావోయిస్టు పార్టీకి చెందిన సభ్యులు లొంగిపోయారని ఎస్పీ జితేంద్రకుమార్‌ యాదవ్‌ తెలిపారు. వీరిపై రూ.66 లక్షల రివార్డులు ఉన్నట్లు ప్రకటించారు.

Tags

Next Story