అమెరికాలో ఆంధ్ర విద్యార్థిని ఆకస్మిక మరణం.. రెండు రోజులుగా దగ్గుతోందన్నస్నేహితులు

అమెరికాలోని టెక్సాస్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో 23 ఏళ్ల భారతీయ విద్యార్థిని మృతి చెంది కనిపించడంతో ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆంధ్రప్రదేశ్ నివాసి రాజ్యలక్ష్మి (రాజి) యార్లగడ్డ అనే విద్యార్థిని ఇటీవలే టెక్సాస్ A&M యూనివర్సిటీ-కార్పస్ క్రిస్టి నుండి పట్టభద్రురాలైంది. అక్కడే ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తోంది.
యార్లగడ్డ నవంబర్ 7న మరణించారు. ఆమె బంధువు చైతన్య వైవికె ప్రకారం, గత రెండు మూడు రోజులుగా తీవ్రమైన దగ్గు మరియు ఛాతీ నొప్పితో బాధపడుతోంది. "విషాదకరంగా, నవంబర్ 7, 2025 ఉదయం అలారం మోగుతున్నా మేల్కొనలేదు. దీనితో ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర ఆందోళన చెందారు. నిద్రలోనే మరణించినట్లు గుర్తించారు.
మరణానికి ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి యార్లగడ్డ మృతదేహానికి అమెరికాలో వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని యార్లగడ్డ కుటుంబానికి సహాయం చేయడానికి చైతన్య, టెక్సాస్‌లోని డెంటన్ నుండి గోఫండ్‌మీ ద్వారా నిధుల సేకరణను ప్రారంభించింది.
రాజీ తల్లిదండ్రులది చిన్న వ్యవసాయదారుల కుటుంబం. వ్యవసాయం మీదే ఆధారపడి జీవనాధారం సాగిస్తుంటారు. వారి చిన్న కూతురు అయిన రాజీ భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తన తల్లిదండ్రులకు మెరుగైన జీవితం ఇవ్వాలని ఆమె కూడా కలలు కనేది. ఆమె ఆకస్మిక మరణం కుటుంబాన్ని తీవ్రంగా కలచి వేసింది అని రాజీ బంధువు తెలిపారు.
నిధులు సేకరణ ద్వారా వచ్చే మొత్తాన్ని యార్లగడ్డ మృతదేహాన్ని భారతదేశానికి తరలించేందుకు, ఆమె విద్యా రుణాలను తిరిగి చెల్లించేందుకు మరియు ఆమె తల్లిదండ్రులకు కొంత ఆర్థిక సహాయం అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

