Odisha train accident: 28 శవాలకు ఒకేసారి అంత్యక్రియలు

Odisha train accident: 28 శవాలకు ఒకేసారి అంత్యక్రియలు
4 నెలల తర్వాత

ఒడిశా రాష్ట్రంలో ట్రిపుల్ రైలు ప్రమాదం జరిగి నాలుగు నెలలు గడచినా ఇంకా 28 మృతదేహాలను గుర్తించనే లేదు. బాలాసోర్ జిల్లాలో జరిగిన ఈ రైలు ప్రమాద దుర్ఘటనలో 297 మంది మరణించారు. అయితే వారిలో 28 మృతదేహాలను గుర్తించక పోవడంతో సీబీఐ అధికారుల సమక్షంలో వాటిని భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు అప్పగించనున్నారు. వాటికి మంగళవారం అంత్యక్రియలు చేస్తామని భువనేశ్వర్ మేయర్ సులోచన దాస్ ప్రకటించారు.

4 నెలల క్రితం ఒడిశాలో 3 రైళ్లు ఢీకొని జరిగిన ఘోర ప్రమాదం ఇప్పటికీ దేశప్రజలకు ఒక పీడకల. ఆ భీకర దృశ్యాలు, మృత దేహాలు, చెల్లాచెదురైన మృతదేహాలు.. ఇలాంటి భీతావహ దృశ్యాలు ఇంకా కళ్ల ముందే మెదులుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ దుర్ఘటనలో దాదాపు 300 మంది దుర్మరణం పాలయ్యారు. దాదాపు వెయ్యి మందికిపైగా గాయాల పాలయ్యారు. అయితే ఈ ఘటనలో చనిపోయి.. గుర్తు పట్టకుండా ఉన్న మృతదేహాలు ఇప్పటివరకు ఆస్పత్రుల్లో భద్రపరిచారు. యిమ్స్ భువనేశ్వర్‌కు 162 మృతదేహాలు లభించగా, వాటిలో 81 మృతదేహాలను మొదటి దశలో బాధితుల కుటుంబ సభ్యులకు అప్పగించారు.


పారాదీప్ పోర్ట్ ట్రస్ట్ నుంచి సేకరించిన ఐదు డీప్ ఫ్రీజర్ కంటైనర్లలో మృతదేహాలను ఉంచారు. అయితే ఈ మృతదేహాలు వలస కార్మికులవి కావొచ్చని అధికారులు భావిస్తున్నారు. వారంతా పశ్చిమ బెంగాల్‌లోని మారుమూల ప్రాంతాల నుంచి వచ్చి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే నిబంధనల ప్రకారం.. అనాథ శవాలకు 30 రోజులు దాటితే అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉండగా.. ఈ కేసును సీబీఐ విచారిస్తున్న నేపథ్యంలో అది ఆలస్యం అయింది.

అయితే ఇప్పుడు రైలు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు మృతదేహాలను శాస్త్రీయ పద్ధతిలో అంత్యక్రియలు చేయాలని కోరుతూ ఖుర్దా జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. జూన్‌లో ప్రమాదం జరిగినప్పటి నుంచి మృతదేహాలను భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌లో ఉంచారు. భువనేశ్వర్ నగరంలోని సత్యనగర్, భరత్‌పూర్‌లోని శ్మశానవాటికలకు ఎయిమ్స్ నుంచి మృతదేహాలను తరలించి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలని బీఎంసీ నిర్ణయించినట్లు ఒక అధికారి తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story