తెలంగాణలో కొత్తగా 2,817 పాజిటివ్ కేసులు

తెలంగాణలో కొత్తగా 2,817 పాజిటివ్ కేసులు
తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతుంది. కొత్తగా 2,817 పాజిటివ్‌ కేసులు వచ్చాయి..

తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతుంది. కొత్తగా 2,817 పాజిటివ్‌ కేసులు వచ్చాయి, దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,33,406కి చేరింది. ఇక గత 24 గంటల్లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 8456కి పెరిగింది. నిన్న ఒక్క రోజే 2,611 కరోనా నుండి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన వారి సంఖ్య 1,00,013కి చేరింది. ప్రస్తుతం 32,537 మంది చికిత్స వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.

Tags

Next Story