జాతీయ

Jammu Kashmir: ఆర్మీ క్యాంప్‌పై ఉగ్రవాదుల దాడి.. అమరులైన ముగ్గురు జవాన్లు..

Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఆర్మీ క్యాంప్‌పై దాడి చేశారు.

Jammu Kashmir: ఆర్మీ క్యాంప్‌పై ఉగ్రవాదుల దాడి.. అమరులైన ముగ్గురు జవాన్లు..
X

Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఆర్మీ క్యాంప్‌పై దాడి చేశారు. ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. ఇద్దరు ముష్కరులను భారత బలగాలు మట్టుబెట్టాయి. రాజౌరీలో ఈ ఘటన జరిగింది. పర్గల్‌లోని సైనిక శిబిరమే లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి తెగబడ్డారు. వేకువజామున ఆర్మీ క్యాంప్​ఫెన్సింగ్​దాటుకుని లోపలకు చొరబడేందుకు యత్నించారు.

వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. వారిపై కాల్పులు జరిపారు. హోరాహోరీగా ఎదురుకాల్పులు జరిగాయి. ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ముష్కరుల వద్ద భారీగా ఆయుధాలు ఉన్నట్లు తెలుస్తోంది. చుట్టుపక్కల ఇంకెవరైనా ఉన్నారన్న అనుమానంతో భద్రతా సిబ్బంది విస్తృత సోదాలు జరుపుతున్నారు.

Next Story

RELATED STORIES