Jammu Encounter : జమ్ములో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం..

Jammu Kashmir : షోపియాన్లోని డ్రాచ్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు స్థానిక టెర్రరిస్ట్‌లు మరణించారు. వీరిలో ఇద్దరిని హనన్ బిన్ యాకూబ్, జంషెద్గా గుర్తించారు. పుల్వామాలోని పింగ్లానా ప్రాంతంలో అక్టోబర్ 2న జమ్ముకశ్మీర్పోలీసు జావెద్ దర్ను, సెప్టెంబర్ 24న పుల్వామాలో బంగాల్నుంచి వలస వచ్చిన కూలీని కాల్చి చంపిన కేసుల్లో యాకూబ్, జంషెద్ నిందితులని పోలీసులు తెలిపారు మరోవైపు.. మోలూలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో జమ్ముకశ్మీర్ పోలీసులు,భద్రతా దళాలకు చెందినకమాండోలతో కలసి సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. డ్రాచ్లో ఓ ఇంట్లో దాక్కుని ఉన్న ఉగ్రవాది కాల్పులకు తెగబడగా.. భద్రతా సిబ్బంది కౌంటర్ ఇచ్చాయి.ఎన్‌కౌంటర్‌లో జైషే మహ్మద్‌కు చెందిన ముగ్గురు స్థానిక ఉగ్రవాదులు చనిపోయారు.
మరోవైపు జమ్ముకశ్మీర్లో కేంద్ర హోంమంత్రి అమిత్ చంద్ర షా పర్యటిస్తున్నారు. ఆయన పర్యటన కొనసాగుతుండగానే మరో వైపు ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతుంది. రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో ఒకర్ని.. దక్షిణ కశ్మీర్షోపియాన్ జిల్లాలోని మోలూ ప్రాంతంలో భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. జైషే మహ్మద్ కు చెందిన మరో ముగ్గుర్ని డ్రాచ్ ప్రాంతంలో హతమార్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com