Encounter : జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌

Encounter : జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌
X
ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చిన భద్రతా బలగాలు

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదుల సవాళ్లు పెరుగుతున్న నేపథ్యంలో భద్రతా బలగాలు బుధవారం భారీ చర్యలు చేపట్టాయి. కుప్వారా జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో కనీసం ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. భారత ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్ ఈ సమాచారాన్ని అందించింది. కుప్వారాలోని మచిల్ సెక్టార్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి. కుప్వారాలోని తంగ్‌ధర్ సెక్టార్‌లో మరో ఉగ్రవాది హతమయ్యాడు. ఆగస్ట్ 28-29 అర్ధరాత్రి తాంగ్‌ధర్ సెక్టార్‌లో ఉగ్రవాదులను చూసిన తరువాత, భద్రతా దళాలు పెద్ద శోధన ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ సందర్భంగా మచిల్‌ సెక్టార్‌లో కూడా ఆపరేషన్‌ నిర్వహించారు. 57 రాష్ట్రీయ రైఫిల్స్ (RR) దళాలు ఈ ప్రాంతంలో ఇద్దరు ముగ్గురు ఉగ్రవాదులను గుర్తించాయి.

రాజౌరీ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య మూడో ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఇక్కడ ముగ్గురు నుంచి నలుగురు ఉగ్రవాదులు దాక్కున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. “చొరబాటు అవకాశం గురించి ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌ల మేరకు, భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఆగస్టు 28-29 రాత్రి కుప్వారాలోని తంగ్‌ధర్ ప్రాంతంలో ఆపరేషన్ ప్రారంభించాయి” అని భారత సైన్యం చినార్ కార్ప్స్ ఒక పోస్ట్‌లో పేర్కొంది.. ఇందులో ఒక ఉగ్రవాది హతమయ్యే అవకాశం ఉందని తెలిపింది.

మరొక పోస్ట్‌లో ఇలా అన్నాడు, “భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఆగస్టు 28-29 రాత్రి కుప్వారాలోని మచిల్ సెక్టార్‌లో సంయుక్త ఆపరేషన్‌ను ప్రారంభించారు. ప్రతికూల వాతావరణంలో అనుమానాస్పద కార్యకలాపాలు గమనించాం. మా దళాలు కాల్పులు జరిపాయి. ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆపరేషన్ కొనసాగుతోంది.’’ అంటూ రాసుకొచ్చారు.

జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో బుధ, గురువారాల మధ్య రాత్రి కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ మేరకు అధికారులు సమాచారం అందించారు. బుధవారం రాత్రి 9.30 గంటలకు రాజౌరి జిల్లాలోని ఖేరీ మోహ్రా లాఠీ, దంతాల్ గ్రామాలలో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయని పోలీసు ప్రతినిధి తెలిపారు. సెర్చ్ ఆపరేషన్ సమయంలో 12 గంటల సమయంలో ఉగ్రవాదులను గుర్తించినట్లు అధికార ప్రతినిధి తెలిపారు. ఈ తర్వాత ఖేరీ మోహ్రా ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయని ఆయన చెప్పారు. చుట్టుముట్టిన ప్రాంతంలో ఇద్దరు నుంచి ముగ్గురు ఉగ్రవాదులు దాక్కున్నట్లు అధికారులు తెలిపారు. కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌ను పటిష్టం చేయడానికి అదనపు భద్రతా బలగాలను ఆ ప్రాంతానికి పంపినట్లు ఆయన చెప్పారు. విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ (VDG) బృందం సోమవారం రాత్రి రాజౌరి జిల్లా మీరా-నగ్రోటా గ్రామంలోని ఒక ఇంటి సమీపంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులను గుర్తించి గాలిలోకి కాల్పులు జరిపింది. ఆ తర్వాత భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.

Tags

Next Story