IPC-BNS: మైనర్లపై అత్యాచారానికి పాల్పడితే ఉరే

IPC-BNS: మైనర్లపై అత్యాచారానికి పాల్పడితే ఉరే
ఇక 302 సెక్షన్‌ హత్య కాదు... 420 చీటింగ్ కాదు.. నేర సంబంధిత చట్టాల్లో సమూల మార్పులు...

నేర సంబంధిత చట్టాల్లో సమూల మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా భారత శిక్షాస్మృతి (IPC), క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (CRPC), ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌ల (Indian Evidence Act)ను కొత్త చట్టాలతో భర్తీ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. భారత శిక్షాస్మృతి IPC స్థానంలో భారతీయ న్యాయ సంహిత BNS, నేర శిక్షాస్మృతి CRPC స్థానంలో భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత BNSS, భారతీయ సాక్ష్యాధారాల చట్టం BES స్థానంలో భారతీయ సాక్ష్యా బిల్లు BSS చట్టాలను తీసుకొచ్చింది.

IPC సెక్షన్‌ 302 ప్రకారం ఇతడికి ఉరి శిక్ష విధిస్తున్నాం. ఇది చాలా సినిమాల్లో మనం విన్న డైలాగ్‌. కానీ నూతన సంస్కరణల ప్రకారం ఈ సెక్షన్‌ ప్రకారం హత్య చేసిన వ్యక్తికి మరణశిక్ష లేదా జీవిత ఖైదు విధిస్తారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి నూతన సంస్కరణల వల్ల ఈ సెక్షన్‌ మారింది. మనుషుల హత్య, మహిళలపై అఘాయిత్యాలకు మించిన నేరాలు ఉండవు. కానీ పాత చట్టాల్లో వీటికి 302 స్థానం ఇచ్చారు. అందుకే BNSలో ఈ సెక్షన్‌ను 101గా చేర్చారు. సెక్షన్‌ 302ను భారతీయ న్యాయ సంహిత ప్రకారం సెక్షన్ 302 స్నాచింగ్‌కు విధించే శిక్షగా మార్చారు. దొంగతనం, లాక్కోవడం వంటి వాటికి ఈ సెక్షన్‌ కింద శిక్ష విధిస్తారు.


IPC సెక్షన్ 420... మోసం చేస్తే ఈ శిక్ష కింద శిక్ష విధిస్తారు. కానీ ఈ సెక్షన్‌ కూడా మారింది. BNS 2023 ప్రకారం 420 సెక్షనే లేదు. మోసం చేస్తే నేరం సెక్షన్ 316 కింద శిక్షను విధిస్తారు. ఇలా చాలా మార్పులు తీసుకొచ్చారు. పెళ్లి చేసుకుంటానని, ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి మోసం చేసిన వారికి పదేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తారు. ఆంగ్లేయుల తమ పాలనను రక్షించుకోవడానికి రాజద్రోహ సెక్షన్‌ను తీసుకొచ్చారని, మనది ప్రజాస్వామ్య దేశమని అందుకే రాజద్రోహ సెక్షన్‌ను పూర్తిగా రద్దు చేస్తూ బీఎన్‌ఎస్‌ బిల్లులో ప్రతిపాదనలు చేశామని అమిత్‌ షా తెలిపారు. మొబైల్‌, బంగారు గొలుసుల తస్కరణ కేసుల్లో నిందితులకు శిక్ష విధించడానికి ఇప్పటివరకూ ఎలాంటి నిబంధన లేదు. ఆ తరహా నేరాలనూ కొత్త బిల్లుల్లో చేర్చారు.

నిర్లక్ష్యంతో ప్రమాదానికి కారణమై.. ఘటనాస్థలం నుంచి పారిపోతే పదేళ్ల వరకూ జైలుశిక్ష విధించేందుకు ఇకపై ఆస్కారం ఉంటుంది. రోడ్డుప్రమాదానికి కారణమై.. గాయపడిన బాధితులను పట్టించుకోకుండా, వారిని ఆసుపత్రుల్లో చేర్చకుండా, లేదంటే పోలీసులకు సమాచారం ఇవ్వకుండా పారిపోతే దాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. అప్పుడు 10 ఏళ్ల వరకు జైలు, జరిమానా పడటానికి ఆస్కారముంటుంది.


రాజద్రోహం చట్టాన్ని (Sedition Law) పూర్తిగా రద్దు చేయడంతోపాటు మూక దాడులు (Mob Lynching), మైనర్లపై లైంగిక దాడులకు పాల్పడితే గరిష్ఠంగా మరణశిక్ష (Capital Punishment) పడేలా ప్రతిపాదనలు రూపొందించారు. ఇందుకు సంబంధించి మూడు కొత్త బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టగా.. పరిశీలన కోసం వాటిని స్థాయీ సంఘానికి పంపించారు.

ఈ క్రమంలో బ్రిటిష్‌ చట్టాల స్థానంలో తీసుకువస్తున్న కొత్త చట్టాల్లో ఉన్న కీలక ప్రతిపాదనలు చేశారు. మూడు చట్టాల్లో మొత్తంగా 313 మార్పులు చేశారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు నుంచి కేసు డైరీ వరకు.. ఛార్జ్‌ షీటు నుంచి తీర్పు వచ్చే వరకు ప్రక్రియ మొత్తం డిజిటల్‌ రూపంలోనే కొనసాగనుంది. సామూహిక అత్యాచారాల్లో నిందితులకు 20ఏళ్ల జైలు జైలుశిక్ష... మైనర్లపై జరిగే అత్యాచార కేసుల్లో నేరం రుజువైతే ఉరిశిక్ష విధిస్తారు.

Tags

Read MoreRead Less
Next Story