Earthquake In Gujarat: కచ్‌లో భూకంపం .. భయంతో ఇళ్ల నుంచి పరుగు తీసిన జనం

గుజరాత్‌లోని కచ్ జిల్లాలో శుక్రవారం స్వల్ప భూకంపం సంభవించింది. ఉదయం 4.30 గంటల ప్రాంతంలో భూ ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.4 గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. 23.65° నార్త్ లాటిట్యూడ్, 70.23° ఈస్ట్ లాంగిట్యూడ్ మధ్యలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లుగా తెలిపింది. భూ ప్రకంపనలు రాగానే అక్కడి ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. కాగా, భూకంప ప్రభావిత ప్రాంతంలో అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఇంకా ఎలాంటి సమాచారం రాలేదని అధికారులు వెల్లడించారు.
కచ్ జిల్లాలో తరచూ భూ ప్రకంపనలు సంభవిస్తున్న సంగతి తెలిసిందే. కానీ స్వల్ప భూ ప్రకంపనలతో ఇక్కడ భూకంపాలు సంభవిస్తున్నాయి. 2001లో గుజరాత్‌లో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోగా.. దీని ప్రభావంతో 13,800 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 1.67 లక్షల మంది గాయపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

