Rajasthan: పాఠశాల భవనం కూలి నలుగురు విద్యార్థులు మృతి.. అనేక మందికి గాయాలు

రాజస్థాన్‌లోని ఝలావర్ జిల్లాలో శుక్రవారం నాడు ప్రభుత్వ పాఠశాల భవనం అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ విషాద సంఘటనలో జరిగింది. ఈ సంఘటన ఉదయం 8.30 గంటల ప్రాంతంలో పిప్లోడి ప్రాథమిక పాఠశాలలో జరిగింది.
పాఠశాల భవనం బంగారు భవిష్యత్తు ఉన్న చిన్నారుల ప్రాణాలు తీసింది. భవన శిధిలాలలో చాలా మంది విద్యార్థులు చిక్కుకున్నట్లు సమాచారం. ఇప్పటివరకు కనీసం నలుగురు పిల్లలు మరణించగా, మరో 17 మంది గాయపడ్డారు. 30 మందికి పైగా పిల్లలు ఇప్పటికీ శిథిలాల కింద చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. శిధిలాల కింద చిక్కుకున్న విద్యార్థులను రక్షించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. నివేదికల ప్రకారం, భవనం శిథిలావస్థలో ఉందని గతంలో అనేక ఫిర్యాదులు ప్రభుత్వ అధికారులకు విన్నవించుకుంది పాఠశాల యాజమాన్యం. అయినా సత్వర నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ రోజు విద్యార్ధులు బలయ్యారు. ఈ పాఠశాల 8వ తరగతి వరకు విద్యార్థులు చదువుకునేందుకు అవకాశం ఉంది.
రెస్క్యూ బృందాలు శిథిలాల కింద నుండి పిల్లలను బయటకు తీస్తున్నారు. వీరికి పాఠశాల ఉపాధ్యాయులు మరియు స్థానిక గ్రామస్తులు సహాయం చేస్తున్నారని పోలీసులు తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. రెస్క్యూ కార్యకలాపాలు ఇంకా కొనసాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ పూర్తయితే కానీ ఎంత మంది విద్యార్ధులు ప్రాణాలతో ఉన్నారనే విషయం తెలియదు. గాయపడిన పది మంది పిల్లలను ఝలావర్‌లోని ఆసుపత్రికి తరలించామని, వారిలో ముగ్గురు లేదా నలుగురు పరిస్థితి విషమంగా ఉందని పోలీసు సూపరింటెండెంట్ అమిత్ కుమార్ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com