Mumbai: ముంబైలో గాలివాన బీభత్సం, హోర్డింగ్ కూలి 9 మంది మృతి,

భీకర గాలులు, అకాల వర్షంతో దేశ ఆర్థిక రాజధాని ముంబై సోమవారం గడగడలాడిపోయింది . భీకరగాలులకు ఘాట్కోపర్ ప్రాంతంలో అక్రమంగా ఏర్పాటుచేసిన ఓ భారీ హోర్డింగ్ పెట్రోల్ పంప్‌పై కుప్పకూలగా.. 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 70 మంది తీవ్రంగా గాయపడ్డారు. పెట్రోల్ పంప్, హోర్డింగ్ శిథిలాల కింద 22 మంది చిక్కుకున్నారని బీఎంసీ అధికారులు తెలిపారు. సీఎం ఏక్‌నాథ్ షిండే ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యల్ని పర్యవేక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు నష్టపరిహారాన్ని ప్రకటించారు. క్రేన్లు, గ్యాస్ కట్టర్లతో శిథిలాలను తొలగిస్తూ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టామని అధికారులు చెప్పారు. గాయపడ్డ 70 మందిని వివిధ ఆసుపత్రిలకు తరలించి వైద్య చికిత్స అందిస్తున్నామని బీఎంసీ అధికారి చెప్పారు.
సోమవారం సాయంత్రం ముంబైలోని ఘాట్‌కోపర్‌లో బలమైన దుమ్ము తుఫాను కారణంగా ఇంధన స్టేషన్‌పై భారీ బిల్‌బోర్డ్ కూలిపోయింది. ఒక్కసారిగా కూలడంతో శిథిలాల కింద డజన్ల కొద్దీ ప్రజలు చిక్కుకున్నారన్నారు. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా, 59 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. బిల్ బోర్డు పెట్రోల్ బంక్‌కు ఎదురుగా ఉంది. కూలిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అనేకా కార్లు కూడా డ్యామేజ్ అయ్యాయి. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్) బృందాలు ఘటనాస్థలికి చేరుకుని శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీశారు. ఇంకా సహాయ చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.
అయితే ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. ఈ మేరకు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల నష్టపరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఈదురుగాలుల ప్రభావంతో మెట్రో, లోకల్ రైలు సర్వీసులకు అంతరాయం కలిగింది. అలాగే విమాన సర్వీసులు కూడా నిలిచిపోయాయి.
మధ్యాహ్నం 3 గంటలకు ఒక్కసారిగా ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. మరోవైపు భారీ ధూళి తుఫాన్ నగరాన్ని కమ్మేసింది. దీంతో ఒక్కసారిగా వాహనదారులు, ప్రజలు ఏం జరుగుతుందో అర్థంకాక… భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక రోడ్లపై వాహనాలు నిలిపివేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ధూళితో కూడిన తుఫాన్ ఒక్కసారిగా దూసుకొచ్చింది. దీంతో వాహనదారులు.. తలదాచుకునేందుకు ప్రయత్నించగా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. మరోవైపు పెద్ద ఎత్తున వర్షం కురిసింది. ఓ వైపు ధూళి తుఫాన్.. ఇంకోవైపు భారీ వర్షంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ముంబైలోని ఘట్‌కోపర్, బాంద్రా కుర్లా, ధారవి ప్రాంతంలో బలమైన గాలులు, వర్షం పడింది.
కుప్పకూలిన హోర్డింగ్‌కు కార్పొరేషన్ నుంచి ఎలాంటి అనుమతులు లేవని, అక్రమంగా అక్కడ ఏర్పాటుచేశారని బీఎంసీ కమిషనర్ భూషణ్ గాగ్రానీ చెప్పారు. భీకరమైన గాలివాన ధాటికి వడాలాలో నిర్మాణంలో ఉన్న మెటల్ పార్కింగ్ టవర్ కుప్పకూలింది. వెలుతురు సరిగా లేకపోవటంతో లోకల్ రైళ్లను, ముంబై ఎయిర్‌పోర్ట్‌లో పలు విమాన సర్వీసులను కొన్ని గంటలపాటు నిలిపివేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com