West Bengal: పశ్చిమ బెంగాల్లో తుఫాను విధ్వంసం

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.జల్‌పైగురి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఆకస్మాత్తుగా తుఫాన్ భారీ విధ్వంసం సృష్టించింది. వడగళ్లతో కూడిన భారీవర్షాలతో ఇళ్లు నేలమట్టమయ్యాయి. పంట పొలాల్లోకి భారీగా వరద నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలు జల దిగ్భంధంలో చిక్కుకున్నాయి. అలాటే అసోం, మణిపూర్ లోకూడా ఎడ తెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మైనగురిలోని అనేక ప్రాంతాలను బలమైన గాలులు వీయడంతో అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి, చెట్లు నేలకూలాయి మరియు విద్యుత్ స్తంభాలు పడిపోయాయి.
ఒక్కసారిగా వచ్చిన ఈ వరదల్లో నలుగురు ప్రాణాలను కోల్పోయారు. 100 మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మరికొంతమంది నిరాశ్రయులయ్యారు. వందల వాహనాలు, మూగ జీవాలు కొట్టుకు పోయాయని అధికారులు తెలిపారు.లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలిస్తున్నారు.
ఎక్కువగా ప్రభావితమైన ప్రాంతాలలో రాజర్‌హట్, బర్నిష్, బకాలీ, జోర్పక్డి, మధబ్దంగా , సప్తిబరి ఉన్నాయి. భారీ వర్షాలతో సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయ, పునరావాస పనులు చేపట్టారు. లోతట్టుప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సహాయక సామాగ్రిని వరద బాధితులకు అందజేశారు. పంట పొలాలు నీట మునిగాయి. సహాయ శిబిరాల్లో వరద బాధితులకు ఆహారం అందజేశారు. వరద బాధితులను ఆదుకునేందుకు అన్ని శాఖల సిబ్బంది అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదేశించారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టంతో పాటు అనేక మంది గాయపడ్డ వారి కుటుంబాలకు తన సానుభూతి తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com