చేతిలో 4 మాస్టర్స్ డిగ్రీలు.. చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి కూరగాయలు అమ్ముతూ..

చేతిలో 4 మాస్టర్స్ డిగ్రీలు.. చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి కూరగాయలు అమ్ముతూ..
చదువుకోవడం అంటే చాలా ఇష్టం.. అందుకే 4 మాస్టర్స్ డిగ్రీలు చేశాడు. చదువు చెప్పడమంటే మరీ ఇష్టం.

చదువుకోవడం అంటే చాలా ఇష్టం.. అందుకే 4 మాస్టర్స్ డిగ్రీలు చేశాడు. చదువు చెప్పడమంటే మరీ ఇష్టం. అందుకే పంజాబ్ యూనివర్శిటీలో 11 ఏళ్లు ప్రొఫెసర్ గా పని చేశాడు. ఉన్నట్టుండి ఒక రోజు చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేశాడు. నెలా నెలా వచ్చే జీతాన్ని వదులుకుని చిరు వ్యాపారాన్ని ప్రారంభించాడు. బండి మీద కూరగాయలు పెట్టుకుని ఇంటింటికీ తిరుగుతూ విక్రయిస్తున్నాడు.

పంజాబ్ కు చెందిన సందీప్ సింగ్ (39) జర్నలిజం, పొలిటికల్ సైన్స్ వంటి రంగాలలో నాలుగు మాస్టర్స్ డిగ్రీలు, న్యాయశాస్త్రంలో PhD చేశాడు. ఇంకా ఇప్పుడు కూడా చదువుతూనే ఉన్నాడు.అంతటి ఉన్నత విద్యావంతుడు తన కుటుంబ అవసరాల కోసం కూరగాయలు అమ్ముతున్నాడు.

"నాకు సకాలంలో జీతం రాకపోవడం, తరచూ వేతనంలో కోత విధించడం వల్ల నేను ఉద్యోగం నుండి నిష్క్రమించాల్సి వచ్చింది. ఆ ఉద్యోగంతో గడపడం నాకు కష్టంగా మారింది. అందుకే నేను నా కుటుంబ మనుగడ కోసం కూరగాయలు అమ్మాలని నిర్ణయించుకున్నాను.

'Ph.D. సబ్జీ వాలా' అని కూరగాయల బండి మీద రాసి ఉంటుంది. ఆ బండితో ఇల్లిల్లూ తిరుగుతూ కూరగాయలు విక్రయిస్తున్నాడు. ప్రొఫెసర్‌గా పనిచేసిన కాలం కంటే కూరగాయలు అమ్మడం వల్ల ఎక్కువ డబ్బు వస్తుందని అతను పేర్కొన్నాడు. అతను రోజంతా పని చేసి ఇంటికి తిరిగి వచ్చి తన పరీక్షకు సిద్ధమవుతాడు.

డాక్టర్ సందీప్ సింగ్ బోధన నుండి విరామం తీసుకున్నాడు, కానీ అతను తన అభిరుచిని మాత్రం వదులుకోలేదు. డబ్బు ఆదా చేసి ఏదో ఒక రోజు సొంతంగా ఓ ట్యూషన్ సెంటర్‌ని తెరవాలని ఆశపడుతున్నాడు.

Tags

Next Story