Dalit Athlete: ద‌ళిత అథ్లెట్‌పై లైంగిక వేధింపులు కేసు లో సంచలన విషయాలు

Dalit Athlete: ద‌ళిత అథ్లెట్‌పై లైంగిక వేధింపులు కేసు  లో సంచలన విషయాలు
X
44 మందిని అరెస్టు చేసిన పోలీసులు

: కేర‌ళ‌లో ఓ ద‌ళిత అథ్లెట్‌పై దాదాపు 60 మంది లైంగిక అకృత్యాల‌కు పాల్ప‌డ్డార‌నే విష‌యం సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసు విచారించేందుకు ఏర్పాటైన ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం.. ఇప్ప‌టి వ‌ర‌కు 44 మంది నిందితుల‌ను అరెస్టు చేసి విచారిస్తోంది. బాధిత అథ్లెట్ ఫిర్యాదు మేర‌కు 30 ఎఫ్ఐఆర్‌లు న‌మోదు చేసిన‌ట్లు డీఐజీ ఎస్ అజీతా బేగం పేర్కొన్నారు. నిందితుల్లో ఇద్ద‌రు విదేశాల్లో ఉన్న‌ట్లు గుర్తించామ‌న్నారు. వారిపై లుకౌట్ నోటీసులు జారీ చేసే అంశాన్ని ప‌రిశీలిస్తున్న‌ట్లు తెలిపారు. ఈ కేసులో మ‌రో 13 మందిని అరెస్టు చేయాల్సి ఉంద‌ని పేర్కొన్నారు. వీరి ఆచూకీ కోసం గాలిస్తున్నామ‌ని చెప్పారు. నిందితులేవ‌రినీ వ‌దిలిపెట్ట‌మ‌ని స్ప‌ష్టం చేశారు.

బాధితురాలు 16 సంవత్సరాల వయసులో ఉన్నప్పటి నుంచి ఆమెపై అనేక మంది లైంగిక దాడికి పాల్పడినట్లు కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఈ దారుణానికి పాల్పడినవారిలో ఆమె కోచ్‌లు, సహ క్రీడాకారులు, క్లాస్‌మేట్స్‌ ఉన్నారన్నారు. బాధితురాలి వాంగ్మూలం ప్రకారం, ఆమె తన తండ్రి ఫోన్‌ను ఉపయోగించేవారు. ఆ ఫోన్‌ను, ఆమె రాసిన డైరీలను పరిశీలించి సుమారు 40 మంది అనుమానితులను పోలీసులు గుర్తించారు. నిందితుల్లో ఇద్దరు పరారీలో ఉన్నారు. వారు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. వారి కోసం లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేసేందుకు కేరళ పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంటర్‌పోల్‌ ద్వారా రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ చేయాలని చూస్తున్నారు. వీరితో పాటు మరో 13 మందిని అరెస్టు చేయాల్సి ఉందని ఆమె తెలిపారు. చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ, బాధితురాలికి 13 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి ఈ విధంగా అన్యాయానికి గురవుతున్నదని చెప్పారు.


Tags

Next Story