Tripura : త్రిపురలో ఎయిడ్స్‌తో 47 మంది విద్యార్థుల మృతి

త్రిపుర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సంచలన రిపోర్ట్ బయటపెట్టింది. హెచ్‌ఐవీ ఇన్‌ఫెక్షన్‌తో 47 మంది విద్యార్థులు మరణించారని.. మరో 828 మంది విద్యార్థుల్లో పాజిటివ్‌గా తేలిందని వెల్లడించింది. 220 పాఠశాలలు, 24 కళాశాలలు, విశ్వవిద్యాలయాల నుంచి ఇంజెక్షన్ డ్రగ్స్ తీసుకునే విద్యార్థులను గుర్తించినట్లుగా త్రిపుర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (టీఎస్‌ఎసీఎస్) సీనియర్ అధికారి భట్టాచార్జీ తెలిపారు. ఇక ప్రతి రోజూ ఐదు నుంచి ఏడు కొత్త కేసులు నమోదవుతున్నాయని అధికారి పేర్కొన్నారు.
త్రిపుర జర్నలిస్ట్ యూనియన్, వెబ్ మీడియా ఫోరమ్, TSACS సంయుక్తంగా నిర్వహించిన మీడియా వర్క్‌షాప్‌లో అధికారి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎయిడ్స్ గణాంకాలను వెల్లడించారు. ఇప్పటి వరకు 220 పాఠశాలలు, 24 కళాశాలలు, యూనివర్సిటీల్లో విద్యార్థులు డ్రగ్స్‌కు బానిసలుగా ఉన్నట్లు గుర్తించామని.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 164 ఆరోగ్య కేంద్రాల నుంచి డేటాను సేకరించినట్లు తెలిపారు.
త్రిపురలోని 220 స్కూళ్లు, 4 కాలేజీ, యూనివర్సిటీల్లోని విద్యార్థులు సూదుల ద్వారా తీసుకునే ప్రమాదకరమైన డ్రగ్స్‌కు అలవాటుపడినట్టు గుర్తించామని, దీని ద్వారానే ఈ వ్యాధి సోకుతున్నదని టీఎస్‌ఏసీఎస్ జాయింట్ డైరెక్టర్ భట్టాచార్య తెలిపారు. ప్రతిరోజూ ఐదు నుంచి ఏడు వరకు కొత్త హెచ్‌ఐవీ కేసులు వెలుగుచూస్తున్నాయని చెప్పా రు. వ్యాధి బారిన పడుతున్న వారిలో సంపన్న కుటుంబాలకు చెందిన వారి పిల్లలే అధిక సంఖ్యలో ఉన్నారన్నారు.
రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య మే 2024 నాటికి 8,729 మందిని నమోదు చేసినట్లు తెలిపారు. హెచ్‌ఐవీ కేసుల పెరుగుదలకు ఇంటర్‌వెనస్ డ్రగ్ దుర్వినియోగం కారణమని భట్టాచార్జీ చెప్పారు. హెచ్‌ఐవీ పాజిటివ్ ఉన్నట్లు గుర్తించిన విద్యార్థులంతా సంపన్న కుటుంబాలకు చెందినవారేనని పేర్కొన్నారు. తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ సేవలో ఉన్నవారని తెలిపారు. తమ పిల్లలు డ్రగ్స్ బారిన పడ్డారని విషయాన్ని వారు గ్రహించలేకపోతున్నారన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com