Earthquake: ఢిల్లీలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.7గా తీవ్రత

X
By - jyotsna |29 Aug 2024 12:15 PM IST
రాజధాని పరిసర ప్రాంతాల్లో బలమైన భూకంపం.
గురువారం ఉదయం 11:30 గంటలకు ఢిల్లీ, రాజధాని పరిసర ప్రాంతాల్లో బలమైన భూకంపం సంభవించింది. అయితే ఈ ఘటనకు సంబంధించి భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్థాన్‌లో ఉన్నట్లు సమాచారం. నేషనల్ సిస్మోలజీ సెంటర్ ప్రకారం, ఆఫ్ఘనిస్తాన్ లో బలమైన భూకంపం సంభవించింది. దీని ప్రకంపనలు ఢిల్లీలో కనిపించాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.7గా నమోదైంది. ఢిల్లీలో భూకంపం కారణంగా ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com