Mouth Freshener: ప్రాణం మీదకు తెచ్చిన మౌత్‌ ఫ్రెష్‌నర్‌

Mouth Freshener:  ప్రాణం మీదకు తెచ్చిన మౌత్‌ ఫ్రెష్‌నర్‌
కేఫ్‌లో భోజనం చేసిన స్నేహితులు.. బయటికి వచ్చి రక్తపు వాంతులు

హర్యానాలో దారుణం చోటు చేసుకుంది. ఓ రెస్టారెంట్‌లో ఫుడ్ తిన్న కొందరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఐదుగురు ఫ్రెండ్స్ ఆ రెస్టారెంట్‌లో తిని రక్తపు వాంతులు చేసుకున్నారు. ఈ ఘటనతో ఆ రెస్టారెంట్‌లో ఉన్న మిగిలిన కస్టమర్లు షాక్‌లో మునిగిపోయారు. వారు ఆహారం తిని రెస్టారెంట్ బయటికి వస్తుండగానే.. అక్కడే రక్తపు వాంతులు చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ బాధితులు నోట్లో మంటగా ఉందని అరవడం ప్రస్తుతం సంచలనం అయింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను అక్కడే ఉన్న వారు వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్‌‌గా మారింది.

అసలేం జరిగిందంటే..

గురుగ్రామ్ లోని ఓ రెస్టారెంట్ కు కొందరు కస్టమర్లు వెళ్లారు. కస్టమర్లు అక్కడ భోజనం చేసిన తరువాత మౌత్ ఫ్రెషనర్ వినియోగించారు. కొన్ని సెకన్లలోనే వారికి నోరు మండిపోయిన ఫీలింగ్ కలిగింది. వారిలో ఐదు మంది కస్టమర్లు రక్తపు వాంతులు చేసుకోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. వాంతులు చేసుకున్న ఐదుగురు కస్టమర్లను వైద్య చికిత్స అందించేందుకు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. మౌత్ ఫ్రెషనర్‌లో విషం ఏమైనా కలిసిందా, లేక ఏమైనా హానికారక రసాయానాలు వాడారా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆ మౌత్ ఫ్రెషనర్‌లో ప్రాణాంతక యాసిడ్ ఉందని ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. ఇదే విషయాన్ని డాక్టర్లు ధ్రువీకరించారని పిపా న్యూస్ వెల్లడింది. మౌత్ ఫ్రెషనర్‌లో ఉన్న కొన్ని పదార్థాలు ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందన్నారు. బాధితులు వాంతులు చేసుకోవడం, నోట్లో నీళ్లు పోసుకుని పుక్కిలించి బటయకు ఊసే ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉన్న వీడియో వైరల్ గా మారింది. సరదాగా రెస్టారెంట్ కు వెళ్తే ఇలా ప్రాణాల మీదకి రావడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని కోరుతూనే, రెస్టారెంట్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గురుగ్రామ్‌లో ఈ నెల 2 వ తేదీన జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే తమకు రెస్టారెంట్ సిబ్బంది ఇచ్చిన మౌత్ ఫ్రెష్‌నర్‌ను డాక్టర్‌కుచూపించగా.. అది మౌత్ ఫ్రెష్‌నర్ కాదని.. డ్రై ఐస్ అని గుర్తించారు. దాని కారణంగానే వారికి రక్తపు వాంతులు, నోట్లో మంట వచ్చాయని పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story