Agra: టూరిస్ట్ పై దాడి కేసులో ఐదుగురు అరెస్టు

Agra: టూరిస్ట్ పై దాడి కేసులో ఐదుగురు అరెస్టు
కర్రలు, రాడ్లతో దాడి చేసిన దుండగులు

దేశంలో రాను రాను క్రైమ్ రేట్ పెరిగిపోతోంది. చిన్న చిన్న విషయాలకే ఒక్కోసారి అల్లరి మూకలు రెచ్చిపోతున్నాయి. చిన్న చిన్న కారణాలకే దాడులకు దిగుతాయి. తాజాగా ప్రముఖ పర్యాటక ప్రాంతం ఆగ్రాలో దారుణం జరిగింది. ఓ టూరిస్టును కొందరు యువకులు చితగ్గొట్టేశారు.కర్రలు, రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి మాములుగా తాజ్ మహల్ చూసేందుకు కారులో ఆగ్రాకి వెళ్లాడు. అయితే రోడ్డుపై వెళ్తుండగా.. అతడి కారు ఓ యువకుడిని తాకింది. సారీ చెప్పింది వెళ్ళిపోబోయాడు టూరిస్ట్.. కానీ గాయపడిన యువకుడితో పాటు ఉన్న స్నేహితులు రెచ్చిపోయారు. ఆ వ్యక్తితో గొడవకు దిగారు. వారి నుంచి తప్పించుకునేందుకు, తన ప్రాణాలు కాపాడుకునేందుకు బాధితుడు సమీపంలోని ఓ స్వీట్ షాపులోకి దూరాడు. అయినా అల్లరిమూక అతడిని వదల్లేదు. షాపులోకి చొరబడి మరీ కొట్టారు. తనను క్షమించాలని బాధితుడు చేతులు జోడించి మరీ వేడుకున్నాడు. అయినా వాళ్లు అస్సలు కనికరం చూపలేదు.అక్కడితో ఆగకుండా చూస్తుండగానే కర్రలు, రాడ్ల తీసుకొచ్చి ఆ వ్యక్తిపై దాడి చేశారు. వీధుల్లో పరిగెత్తించి మరీ కొట్టారు.

పర్యాటకుడు తనను తాను రక్షించుకోవడానికి చాలా ప్రయత్నించాడు. అయితే దాడి చేసేవారు ఎక్కువమంది ఉండటంతో ఆ టూరిస్ట్ నిస్సహాయక స్థితిలో ఉండిపోయాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనకు సంబంధించి ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పర్యాటకుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, అతని పరిస్థితి నిలకడగా ఉందని పోలీస్ అధికారులు వెల్లడించారు.

ఈ సంఘటన వీడియో పై నేటిజన్లు మండిపోతున్నారు. పర్యాటకుల భద్రతను మెరుగుపరచడానికి ప్రభుత్వం చర్య తీసుకోవాలని డిమాండ్స్ చేస్తున్నారు. దీంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, మరోసారి అలాంటి ఘటన జరగకుండా చూస్తామని హామీ ఇచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story