UP TRAGEDY: విద్యుత్ షాక్‌తో అయిదుగురు భక్తుల మృతి

ఉత్తరప్రదేశ్‌లో ఘోరం జరిగింది. మతపరమైన ఊరేగింపులో తీవ్ర విషాదం నెలకొంది. మీరట్ జిల్లా భావన్‌పూర్ పరిధిలోని రాలీ చౌహాన్ గ్రామంలో విద్యుత్ షాక్‌తో అయిదుగురు భక్తులు(Five people) మరణించారు. చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. మహా శివుడి భక్తులైన(Lord Shiva) కన్వారియాల(Kanwariyas) సమూహం హరిద్వార్ నుంచి పవిత్ర గంగా నది నీటి(Ganges River)ని తీసుకొని తిరిగి వస్తుండగా ఈ ఘోరం జరిగింది. గంగా నది నీటిని తీసుకొని వస్తున్న కన్వారియాల వాహనం గ్రామంలోకి తిరిగి వస్తుండగా... కిందకు వేలాడున్న హై టెన్షన్ విద్యుత్ వైరు(high-tension line) భక్తులకు తగిలింది.
హై-వోల్టేజీ కరెంట్ వైర్(high-voltage current charged) తగలగానే వాహనం మొత్తానికి విద్యుత్ సరఫరా అయ్యింది. వాహనంలోని ఉన్న కన్వారియా భక్తులు విద్యుత్ షాక్‌తో తీవ్రంగా గాయపడ్డారు. గ్రామస్థులు విద్యుత్ సరఫరాను నిలిపేయాలని సబ్ స్టేషన్‌కు కాల్ చేశారు. కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది. విద్యుత్ ప్రమాదంలో మనీష్ అనే భక్తుడు ఘటనా స్థలంలోనే మరణించగా.. మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మరో ఐదుగురు బాధితుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఈ దుర్ఘటనతో గ్రామస్తుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబుక్కాయి. ప్రమాదానికి విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమని, వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రహదారిని దిగ్బంధించారు. కన్వర్ యాత్రకు సన్నాహాలు చేయడంలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అందుకే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు మండిపడ్డారు. మరణించిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
కన్వర్ యాత్ర(Kanwar Yatra) దేశంలో అతిపెద్ద మతపరమైన సమావేశం. ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఒడిషా, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి ప్రతి ఏడాది 12 లక్షల మంది ఇందులో పాల్గొంటారు. కన్వరియాలు కాషాయ వస్త్రాలు ధరించి, భక్తి ప్రదర్శనలో చెప్పులు లేకుండా నడుస్తారు. ఇలాంటి విషాద ఘటనే గత నెలలో త్రిపురలో జరిగింది. రథానికి హై-వోల్టేజ్ విద్యుత్ వైరుతో తాకడంతో ఇద్దరు పిల్లలు సహా ఏడుగురు మరణించారు. 16 మంది గాయపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com