జాతీయ

Jammu Kashmir: జమ్మూకశ్మీరులో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ టెంపో.. అయిదుగురు దుర్మరణం..

Jammu Kashmir: జమ్మూకశ్మీరులోని రాంబన్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ టెంపో ట్రాలీ అదుపు తప్పి లోయలో పడిపోయింది.

Jammu Kashmir: జమ్మూకశ్మీరులో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ టెంపో.. అయిదుగురు దుర్మరణం..
X

Jammu Kashmir: జమ్మూకశ్మీరులోని రాంబన్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ టెంపో ట్రాలీ అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా.. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. రాంబన్ జిల్లాలో జమ్మూ నుంచి బనీహాల్‌కు టెంపో ట్రాలీలో వెళుతుండగా ప్రమాదవశాత్తూ లోయలో పడింది. ముందు టెంపో ఓ కారును ఢీకొందని పోలీసులు చెప్పారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బ్రేకులు ఫెయిలవడం వల్లనే ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు.

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES