Road Accident: ఝార్ఖండ్‌లో రోడ్డు ప్రమాదం
ఝార్ఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది . ఎస్‌యూవీ కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ కొట్టడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గిరిధి జిల్లా లోని బాగ్మారాలో గల ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
థోరియా గ్రామానికి చెందిన కొందరు టికోడిహ్‌లో జరిగిన వివాహ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్న సమయంలో వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ కొట్టింది ప్రమాద సమయంలో కారులో 10 మంది ఉన్నారు. అందులో ఐదు గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరంతా శుక్రవారం తికోడిహ్ ప్రాంతంలో పెళ్లికి హాజరయ్యారు. అక్కడే భోజనం చేసి రాత్రి స్కార్పియో వాహనంలో ఇంటికి తిరిగి బయల్దేరారు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున బాగ్మారా గ్రామం సమీపంలో వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ప్రమాదం దాటికి కారు పూర్తిగా ధ్వంసమైంది.
గమనించిన స్థానికులు సంఘటన స్థలానికి చేరుకొని కారులో చిక్కుకున్న వారిని బయటకు తీసే ప్రయత్నం చేశారు. కారులో మొత్తం పది మంది ప్రయాణిస్తుండగా.. ప్రమాద స్థలంలోనే అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన అయిదుగిరిని స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే కారణం కావచ్చని గిరిధి సదర్ సబ్ డివిజనల్ పోలీసు అధికారి అనిల్ సింగ్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com