Terror Suspects: భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. అయిదుగురు అరెస్ట్‌

Terror Suspects: భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. అయిదుగురు అరెస్ట్‌
బెంగళూరులో భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసిన పోలీసులు.. అయిదుగురు అనుమానిత ఉగ్రవాదులు అరెస్ట్‌

కర్ణాటక రాజధాని బెంగళూరులో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. బాంబు పేలుడుకు పథకం రచించిన ఐదుగురు అనుమానిత ఉగ్రవాదుల( Five terror suspects)ను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్(CCB) పోలీసులు అరెస్ట్( arrested) చేశారు. నిందితుల నుంచి భారీగా పేలుడు పదార్థాల(explosives )ను స్వాధీనం చేసుకున్నారు. బాంబు దాడికి ప్రణాళిక చేసిన నిందితులను సయ్యద్ సుహేల్, ఉమర్, జానిద్, ముదాసిర్, జాహిద్ లుగా గుర్తించారు.


2017 నాటి ఓ హత్య కేసులో వీరంతా నిందితులని, పరప్పణ అగ్రహార సెంట్రల్ జైలులో వీరికి ఉగ్రవాదులతో పరిచయం ఏర్పడిందని CCB తెలిపింది. నిందితుల వద్ద ఏడు దేశీయ తుపాకులు, 42 లైవ్ బుల్లెట్లు, మందుగుండు, రెండు కత్తులు, రెండు శాటిలైట్ ఫోన్లు, నాలుగు గ్రెనేడ్ ఉన్నాయని అధికారులు వెల్లడించారు.


ప్రస్తుతం మదివాలా టెక్నికల్ సెల్ లో నిందితులను ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు. నిందితుల మొబైల్ ఫోన్లను తనిఖీ చేస్తున్నామని, అందులోని సమాచారంతో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని వివరించారు.




Tags

Read MoreRead Less
Next Story