Wolf Attacks: మనిషి మాంసానికి మరిగిన తోడేళ్లు

Wolf Attacks: మనిషి మాంసానికి మరిగిన తోడేళ్లు
X
పిల్లలే టార్గెట్‌గా దాడులు.. ఇప్పటి వరకు 8 మంది మృతి..

త్తరప్రదేశ్ రాష్ట్రంలోని బహ్రైచ్ జిల్లాలో తోడేళ్ల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మానవ మాంసానికి మరిగిని తోడేళ్లు చిన్న పిల్లలే టార్గెట్‌గా రాత్రి సమయాల్లో ఊళ్లపై పడుతున్నాయి. బహ్రైచ్ జిల్లాలోని 35 గ్రామాల్లో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. జూలై 17 నుంచి ఈ తోడేళ్ల దాడుల్లో 8 మంది మరణించారు. మరణించిన వారిలో ఏడుగురు పిల్లలే ఉన్నారు. మరో 30 మమంది వరకు గాయపడ్డారు.

ఈ తోడేళ్లను పట్టుకునేందుకు వందలాది మంది అటవీ శాఖ అధికారులు, పోలీసులు శ్రమిస్తున్నారు. ఆరు తోడేళ్లు కలిగిన గుంపులో ఇప్పటి వరకు అధికారులు నాలుగింటిని బంధించారు. మరో రెండు మాత్రం యథావిధిగా వేటాడుతున్నాయి. తాజాగా సెప్టెంబర్ 2-3 తేదీల మద్య మరోసారి దాడి జరిగింది. జిల్లాలోని గిర్‌ధార్‌పూర్ ప్రాంతంలో 5 ఏళ్ల బాలికపై దాడి జరిగింది. ఆమె తల, మెడపై గాయాలయ్యాయి. దాడి తర్వాత బాలికనున ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు చెప్పారు.

జిల్లా కలెక్టర్ రాణి, ఎస్పీ బృందా శుక్లా బాలిక పరిస్థితిపై ఆరా తీశారు. గత 24 గంటల్లో ఇది రెండో దాడి కావడం గమనార్హం. ఈ తోడేళ్ల దాడులపై యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ మరిన్ని బలగాలను మోహరించాలని ఆదేశించారు. ‘‘ఆపరేషన్ భేదియా’’ కింద నాలుగు తోడేళ్లను పట్టుకున్నారు. రాత్రివేళల్లో అధికారులు గస్తీ పెంచారు. తోడేళ్లను పట్టుకునేందుకు ఏనుగుల పేడ, మూత్రంతో గ్రామాల నుంచి దూరంగా పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. పిల్లలే లక్ష్యం కావడంతో అటవీ అధికారులు పిల్లల సైజులో ఉండే బొమ్మలకు తీసుకువచ్చి, వాటికి పిల్లల మూత్రంలో తడిపి తోడేళ్లను తప్పుదారి పట్టించి, బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Tags

Next Story