Chhattisgarh: 50 మంది నక్సలైట్ల లొంగుబాటు

Chhattisgarh:  50 మంది నక్సలైట్ల లొంగుబాటు
X
మోడీ టూర్‌కు ముందు కీలక పరిణామం

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా పెద్దఎత్తున మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో కరడు గట్టిన మావోయిస్టులు సైతం ఉన్నారు. ప్రధాని మోదీ ఛత్తీస్‌గఢ్‌ పర్యటనకు కొన్ని గంటల ముందు ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను బీజాపూర్‌ జిల్లా ఎస్పీ జితేంద్రయాదవ్‌ వెల్లడించారు.

ప్రధాని మోడీ ఆదివారం ఛత్తీస్‌గఢ్ పర్యటనకు ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. 50 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. శనివారం సుక్మా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. దాదాపు 18 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఇలా మూడు నెలల కాలంలో మొత్తం 100 మందికిపైగా మావోయిస్టులు చనిపోయారు.

అయితే ఆదివారం ప్రధాని మోడీ ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించనున్నారు. ఈ మధ్య మావోయిస్టులకు వరుస దెబ్బలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో అనూహ్యంగా 50 మంది మావోయిస్టులు లొంగిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే ఇందులో 14 మంది మావోయిస్టులపై రూ.68 లక్షల రివార్డ్స్ ఉన్నాయి. ఒక్కొక్కరిపై దాదాపుగా రూ.5లక్షల వరకు రివార్డ్ ఉంది. బీజాపూర్‌ జిల్లా పోలీసులు నిర్వహిస్తున్న ‘నియద్‌ నెల్లనార్‌’ కార్యక్రమానికి ఆకర్షితులైన మావోయిస్టులు లొంగిపోయేందుకు ముందుకు వస్తున్నారని బీజాపూర్‌ జిల్లా ఎస్పీ తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న వరుస ఆపరేషన్లతో మావోయిస్టులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు.

వారు తమ పార్టీ సిద్ధాంతాలపైనా అసంతృప్తికి లోనై, ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలిసేందుకు వస్తున్నారని తెలిపారు. లొంగిపోయిన నక్సలైట్లలో మావోయిస్ట్‌ అగ్రనేత హిడ్మాకు అనుసంధానంగా ఉన్న బెటాలియన్లకు చెందిన వారున్నారని చెప్పారు. నక్సల్స్‌ లొంగుబాటును కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా స్వాగతించారు.

Tags

Next Story