Congo fever: గుజరాత్‌లో కాంగో ఫీవర్క లకలం.

Congo fever: గుజరాత్‌లో  కాంగో ఫీవర్క లకలం.
X
5 ఏళ్లలో తొలిసారి రోగి మృతి..

గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో 51 ఏళ్ల వ్యక్తి క్రిమియన్-కాంగో హెమరేజిక్ జ్వరంతో మరణించాడు. సాధారణంగా దీనిని ‘‘కాంగో జ్వరం’’గా పిలుస్తుంటారు. గత 5 ఏళ్లలో ఈ ఇన్ఫెక్షన్‌కి సంబంధించి మొదటిసారిగా మరణం సంభవించినట్లు వైద్యులు మంగళవారం తెలిపారు. మోహన్ భాయ్‌గా గుర్తించబడిన బాధితుడు పశువుల పెంపకందారుడు. జనవరి 21న ఆస్పత్రిలో చేరాడు. జనవరి 27న చికిత్స సమయంలో మరణించారు. అతడి బ్లడ్ శాంపిళ్లనున పూణేలోని ల్యాబ్‌కి పంపగా, ఈ వైరస్ ఉనికి బయటపడింది.

రోగి మరణంతో ఆయన నివాసం ప్రాంతంలో ఆరోగ్య శాఖ నిఘా పెంచింది. మరిన్ని కేసులు రాకుండా అధికారులు కుటుంబ సభ్యుల్ని పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఈ వైరస్ సోకిన రోగులకు జ్వరం, కండరాల నొప్పి, తలనొప్పి, తలతిరగడం వంటి లక్షణాలు ఉంటాయి. ఇన్ఫెక్షన్ సోకిన 2-4 రోజుల తర్వాత నిద్రలేమి, నిరాశ, కడుపు నొప్పి, నోరు, గొంతు, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం.. క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్ వైరస్ తీవ్రమైన జ్వరానికి కారణమవుతుంది. దీని మరణాల రేటు 40 శాతం వరకు ఉంది. ప్రస్తుతం దీనికి టీకాలు లేవు. ఈ వైరస్ ప్రధానంగా పేలు, పెంపుడు జంతువుల నుంచి వ్యాపిస్తుంది. ఈ వైరస్ సోకిన వ్యక్తుల రక్తం, ఇతర శరీర స్రావాలు ద్వారా అతడికి దగ్గరగా ఉన్న వ్యక్తులకు కూడా సోకే అవకాశం ఉంది.

Tags

Next Story